కళ్ళ ఆరోగ్యానికి ఇవే కీలకం


కంటిచూపు మెరుగుపడటానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి కీలకం .

*కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ అత్యంత ముఖ్యమైనది. ఇది రాత్రి సమయంలో దృష్టిని మెరుగుపరచడం తో పాటు కళ్లు పొడిబారడాన్ని నివారిస్తుంది.
* క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది.
*క్యారెట్ల మాదిరిగానే చిలగడదుంపలలో కూడా బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది.
* పాలకూర, కాలే, తోటకూర, బచ్చలికూర వంటి ముదురు ఆకుపచ్చ కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ ఏ కు మంచి వనరైన గుమ్మడికాయ కూడా తీసుకుంటుండాలి.
*గుడ్డు పచ్చ సొన, మామిడి, బొప్పాయిల్లో కూడా బీటా కెరోటిన్ ఉంటుంది.
*విటమిన్ సి ఒక యాంటీఆక్సిడెంట్, ఇది కంటి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
*సిట్రస్ పండ్లు నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్షపండ్లు తీసుకోవాలి. అలాగే ఉసిరికాయ, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్బెర్రీ తరుచు గా తీసుకోవాలి.
*విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కంటి కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించి, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Scroll to Top