ప్రస్తుతం ఎక్కువమంది ఆరోగ్యంపై శ్రద్ధతో శరీరానికి మేలు చేసే ఆహారాలపై దృష్టి సారిస్తున్నారు. అటువంటి వాటిలో బీట్ రూట్ జ్యూస్ ఒకటి. ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్ రూట్ జ్యూస్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి, శక్తిని పెంచడానికి ఈ జ్యూస్ చాలా ఉపయోగపడుతుందని చాలామంది చెబుతారు. అయితే బీట్ రూట్ జ్యూస్ ను అధికంగా తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు వస్తాయని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి.
ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అధిక మొత్తంలో ఈ జ్యూస్ ను తాగడం అనేక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ జ్యూస్ ఖనిజాలు, విటమిన్లు ఫుల్ పోషకాలతో నిండి ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అయినప్పటికీ దీనిని ఎక్కువగా తీసుకోవడం మాత్రం జీర్ణ సమస్యలకు కారణమవుతుందని అధ్యయనాలు తేల్చాయి. కడుపులో ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని స్పష్టమైంది.
బీట్ రూట్ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల మూత్రం రంగు మారుతుంది. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే దీనిని బీట్ యూరియా అనే హానికరమైన పరిస్థితి గా చెబుతారు. బీట్ రూట్ లో అధిక ఆక్సలేట్ స్థాయిలు మూత్రపిండాల పైన ప్రభావం చూపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను అధికంగా తాగితే ఇది మూత్రపిండాలలో రాళ్లను పెంచుతుంది. అందుకే అతిగా బీట్ రూట్ వాడొద్దు మితిమీరిన బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది కాదని, మన శరీరానికి మేలు చేసేది అయినప్పటికీ దీనిని అధికంగా తాగడం ఆరోగ్యానికి అనర్ధాలు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.
