అనారోగ్యాన్ని దూరం చేసే మల్టీవిటమిన్స్, మినరల్స్ విటమిన్స్, మినరల్స్ తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ, మన శరీరం సాఫీగా పనిచేయడానికి అవి చాలా అవసరం. వీటిలో విటమిన్స్ బి, సి, డి, జింక్, క్రోమియం, సెలీనియం వంటి ఖనిజాలు మన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీ రోల్ పోషిస్తాయి. ఉదాహరణకి విటమిన్ సి, జింక్ అందించిన యాంటీ ఆక్సిడెంట్ శ్వాసకోశ అనారోగ్యం నుండి మనల్ని కాపాడుతుంది. దీనికి విరుద్ధంగా తక్కువ విటమిన్ డి స్థాయిల వల్ల ఇన్‌ఫ్లూఎంజా, అలెర్జీ ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. వాస్తవానికి, మీ ఇమ్యూనిటీని ఏ పోషకాలు పోషిస్తాయో తెలుసుకోవడం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, సంక్రమణ ప్రమాదాన్ని, తీవ్రతను తగించడంలో మీకు సాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు కూడా వారి వైద్యునితో సంప్రదించి రెగ్యులర్ సప్లిమెంటేషన్ నుండి ప్రయోజనం పొందవచ్చు. హైపర్‌టెన్షన్ ఉన్న రోగులకి రోజువారీ వ్యాయామ విధానం, సూర్యరశ్మిని క్రమం తప్పకుండా పొందడం, సమతుల్యమైన ఆహారం వంటి జీవనశైలి మార్పులతో పాటు జింక్ సప్లిమెంట్స్‌ను అందించవచ్చు. ఏదైనా మల్టీ విటమిన్స్ తీసుకునే ముందు మీ విటమిన్ స్థాయిలను చెక్ చేసి వైద్యులను సంప్రదించాక వారు రికమెండ్ చేసినవి తీసుకోవాలి. ఎందుకంటే సరికానివి, మీకు నచ్చిన మోతాదులో తీసుకోవడం ప్రమాదకరం. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఫాస్ట్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం అనేది ఓ జీవన విధానంగా మారింది. ఇది పోషక లోపానికి దారి తీస్తుంది. అయినప్పటికీ, మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత వయస్సు, సంబంధిత అవసరాల ఆధారంగా మైక్రోన్యూట్రియెంట్ సప్లిమెంట్స్ పొందవచ్చు. మీ శరీరం అలసిపోయినట్లుగా, ఇబ్బందిగా అనిపించిన మీరు వాటిని విస్మరించొద్దు. ఎందుకంటే ఇవి ప్రారంభ లక్షణాలు పోషకాల లోపానికి. అందుకే వాటిని సరైన సమయంలో గుర్తించి మీ వైద్యుడిని సంప్రదించి సూచించిన సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.