మితిమీరి ఓట్స్ తింటే…. తప్పదు ముప్పు!
***************
ఓట్స్ తో మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఓట్స్ లో విటమిన్ బి2, విటమిన్ సి, పీచు పదార్థం, పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఓట్స్ చాలా మంచి పౌష్టికాహారంగా. అయితే అతిగా ఓట్స్ తింటే అనర్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*అధికంగా ఓట్స్ తిన్న వారిలో కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అధికంగా ఓట్స్ తింటే ఆరోగ్య సమస్యలు ఓట్స్ జీర్ణ సమస్యలకు కారణమవుతోంది. అందుకే ఓట్స్ అధికంగా తినడం మంచిది కాదు. ఓట్స్ లోని ఫైటిక్ యాసిడ్ క్యాల్షియం, ఇనుము, జింక్ వంటి కొన్ని ఖనిజాల శోషణను నిరోధిస్తుంది.
*ఓట్స్ అధికంగా తిన్నవారు మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. కొంతమందికి ఓట్స్ లో ఉండే ప్రోటీన్ కారణంగా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ఓట్స్ పదేపదే తింటే ఇన్ఫెక్షన్స్ ఓట్స్ ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, అవి తిన్నవారికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు.
*పోషకాలు బాగా ఉంటాయని అతిగా ఓట్స్ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఓట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలామందిలో కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల వాటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం కారణంగా మన శరీరంలో కూడా క్యాలరీల లోపం ఏర్పడే అవకాశం ఉంది.
*మితంగా తింటే ఆరోగ్యం కాబట్టి ఓట్స్ ను తినాలి అని అనుకుంటే ఒక నియమిత పద్ధతిలో తినడం మంచిది. ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ మాత్రమే తినడం మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఓట్స్ అధికంగా తింటే కొన్ని దుష్ప్రభావాలు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకొని తదనుగుణంగా మితంగా తింటే మంచిది.