సాధారణంగా మాంసాహారం వల్లే ప్రోటీన్ అధికంగా లభిస్తుందని ఎక్కువమంది భావిస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్లలో కూడా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్లను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిదని చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం…
*జామ పండులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. జామ పండును తినడం వల్ల జీవ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు పోతాయి. జామపండు డయాబెటిస్ ను తగ్గిస్తుంది. ఒక కప్పు జామ ముక్కల్లో 4.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జామకాయలలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
*అరటిపండ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒక మీడియం సైజు అరటిపండు లో 1.1 నుంచి 1.5 ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. అరటి పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
*అవకాడోలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల అవకాడోలో రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అవకాడో లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
*కివి పండ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాములకు కివీ పండ్లలో 1.1 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ సి తో పాటు అన్ని రకాల పోషకాలు కివి పండ్లలో ఉంటాయి. కివి పండ్లను తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
*దానిమ్మ పండు లోని ప్రోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల దానిమ్మ గింజల్లో సుమారు 1.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దానిమ్మ పండులో శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
*100 గ్రాముల బ్లాక్ బెర్రీలలో సుమారు 1.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. స్ట్రా బెర్రీలు, రాస్ప్ బెర్రీలు కూడా ఇదే విధంగా ప్రోటీన్ కలిగి ఉంటాయి. బెర్రీలు కూడా శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
*ప్రోటీన్ శరీరానికి కావలసిన బోలెడు ప్రయోజనాలను ఇస్తుంది. కండరాలు దృఢంగా ఉండాలన్నా, కణాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, హార్మోన్ల ఉత్పత్తి సజావుగా జరగాలన్న ప్రతి చర్యకు ప్రోటీన్ చాలా కీలక భూమిక పోషిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పండ్లు ఎప్పుడూ స్కిప్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.