కొబ్బరి నీళ్ళతో ఉపశమనం


కొబ్బరి నీళ్ళతో వేసవి నుంచి ఉపశమనం
****************
వేసవి కాలం అంటేనే మండే ఎండలతో మాడ్చేసే కాలం. ఈ ఎండలకు వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటివారైనా తట్టుకోలేరు. అయితే ఈ వేసవి ఎండలకు తట్టుకోవడానికి శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా దొరుకుతాయి. డీ హైడ్రేషన్ ను నివారించడానికి కొబ్బరి నీళ్లు ఎంతో బాగా దోహదం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో యాంటి ఆక్సిడెంట్ లు ఉంటాయి. రోగ నిరోధక శక్తినీ బలోపేతం చేయడానికి కొబ్బరి నీళ్లు దోహదపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉదయాన్నే అంటే పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. పరగడుపున కొబ్బరి నీళ్ళతో రోజంతా శరీరం యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఉదయం వ్యాయామం చేసిన వెంటనే మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో వేడిని తగ్గించడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

వేసవి కాలంలో ఎన్ని నీళ్లు తాగిన చెమట రూపంలో నీరు వెళ్ళిపోతుంది. ఈ విధంగా జరగడంతో శరీరానికి సరిపడా నీరు అందకపోవడంతో మూత్ర పిండాలలో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా మూత్ర పిండాలలో రాళ్ళు వస్తాయి, అలాగే మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుంది. వీటన్నిటికి సరైన పరిష్కార మార్గం కొబ్బరి నీళ్ళు తాడగమే. ఈ సమస్యల నుండి కొబ్బరి నీళ్ళతో ఉపశమనం కొబ్బరి నీళ్లు రోజు ఒక లీటర్ కనుక తాగితే మూత్ర విసర్జన సమయంలో సమస్యలు ఉండవు. మూత్ర పిండాలలో రాళ్ళను కొబ్బరి నీళ్ళు కరిగిస్తాయి..రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే శరీరంలో అనేక ఇబ్బందులు వస్తాయి. నరాలు, కండరాల నొప్పులు వస్తాయి. కంటి చూపు సమస్య మొదలవుతుంది. అలాంటి అనేక సమస్యలకు లేత కొబ్బరి నీళ్లు తాగడం వలన ఉపశమనం పొందుతారు.

కొబ్బరి నీళ్ళు రక్తపోటును నియంత్రిస్తాయి.జీర్ణ క్రియకు దోహదం చేస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే కొబ్బరినీళ్ళు అతిగా తాగడం మంచిది కాదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Scroll to Top