గుండె కవాట వ్యాధులపై అశ్రద్ధ వద్దు


వయసు పెరిగే కొద్దీ గుండె కవాట వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే, ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంటే.. ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, ఊబకాయం మొదలైన చెడు అలవాట్లు గుండె కవాటాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.
అధిక రక్తపోటు, మధుమేహం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. క్యాన్సర్ చికిత్స కూడా గుండెను ప్రభావితం చేస్తుందని ఇటీవల పరిశోధనలో తేలింది.

గుండె కవాట వ్యాధుల ఆరంభ లక్షణాలు:
—————————————————–
* ఏదైనా గుండె జబ్బులో అలసట అనేది అత్యంత సాధారణ లక్షణాల్లో ఒకటి. అదేవిధంగా, గుండె కవాట వ్యాధి ఉన్న రోగులు తక్కువ శారీరక శ్రమతో కూడా అలసిపోవచ్చు. కొన్నిసార్లు, వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా రావచ్చు. చిన్న చిన్న పనులకే అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తుంటాయి.

*ఈ వ్యాధుల లక్షణాల్లో పాదాలు లేదా చీలమండల వాపు కూడా ఉంటుంది. ప్రారంభ రోజుల్లో చాలా మంది ఈ వాపును పట్టించుకోక పోవచ్చు. పాదాల్లో వాపు కనిపించిన వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

* గుండె కవాట వ్యాధి ఉన్న రోగులు నిరంతర ఛాతీ నొప్పి భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గుండె దడ పెరగొచ్చు.

* కవాట వ్యాధి ప్రారంభ సంకేతాల్లో తలతిరగడం కూడా ఒకటి. బలహీనత తో పాటు తల తిరగడం కనిపిస్తే అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వేగంగా నడిచినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు క్రమరహిత హృదయ స్పందనలు గమనిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని వారు హెచ్చరిస్తున్నారు.

Scroll to Top