పోషకాలకు నిలయాలు మొలకలు

మొలకలు సహజ సిద్దమైన పోషకాలు అందిస్తాయి. ఉదయం మొలకలు తినడం ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటిగా నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

*మొల‌క‌ల‌ను ఉద‌యం పూట తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ స‌జావుగా సాగుతుంది.
*గ్యాస్, ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పేగుల‌ క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి.
*మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. పేగుల్లో ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది.
*మొల‌క‌ల్లో స‌హ‌జంగా ఉండే జీర్ణ ఎంజైమ్ లు ప్రోటీన్లతో పాటుగా మొల‌క‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి, ముఖ్య‌మైన ఖ‌నిజాలు ఉంటాయి. ఇవి రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.
*మొలకెత్తిన గింజల్లో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. దీని వలన ఎనర్జీగా ఉంటారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్పెక్ష‌న్ లు  దూరంగా ఉంటాయి.
*వీటిని అల్పాహారంలో భాగంగా క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల సాధార‌ణ జ‌లుబు, కాలానుగుణంగా వ‌చ్చే ఫ్లూ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.
* సాధార‌ణంగా మొల‌క‌ల్లో ప్రోటీన్, ఐర‌న్, క్యాల్షియం వంటి పోష‌కాలు ఉంటాయి. నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి. *మొల‌క‌ల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి., ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని తీసుకోవడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.
* మొల‌క‌ల్లో విట‌మిన్ ఎ, సి, ఇ వంటివి ఉంటాయి. వీటి వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు ద‌రి చేరవు.
*మొల‌క‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.  ఆరోగ్య‌క‌ర‌మైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు.

Scroll to Top