ఫ్రెంచ్ ఫ్రైస్ తో వ్యాధుల ముప్పు


ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల టన్నుల ఫ్రైస్ ను ప్రజలు బర్గర్లతో, సోలోగా తింటున్నారు. అయితే ఈ రుచికరమైన ఆహారానికి వెనుక తీవ్రమైన అనారోగ్య సమస్యలు దాగిఉన్నట్లు ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే ఈ చిరుతిళ్లు బరువు పెరగటానికి దోహదపడటంతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్యాలను కలిగిస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ట్రాన్స్ ఫ్యాట్‌లు శరీరంలో పేరుకుపోతాయని, హృదయనాళ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక సర్వింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల 25 సిగరెట్లు తాగినంత హానికరమని ప్రముఖ కార్డియాలజిస్ట్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని హైలైట్ చేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాలలో సాధారణంగా కనిపించే ట్రాన్స్ ఫ్యాట్స్, దీర్ఘకాలంగా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. నూనెను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు ఈ కొవ్వులు ఏర్పడతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధనలో తేలింది.

ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించడానికి నూనెలను పదేపదే వేడి చేయడం వల్ల ఆల్డిహైడ్లు అని పిలువబడే హానికరమైన పదార్ధాలు ఉత్పత్తి అవుతాయి. ఆల్డిహైడ్‌లు డి ఎన్ ఏను దెబ్బతీసి శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ది జర్నల్ ఆఫ్ లిపిడ్ రీసెర్చ్‌లో ప్రచురించిన కథనం ప్రకారం వెల్లడైంది. దేశంలో అనేక ప్రాంతాల్లో బహిరంగంగా సిగరెట్ ధూమపానం తగ్గింది. ఇదే క్రమంలో ఫాస్ట్ ఫుడ్ వినియోగం, ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ పెరిగింది. చాలా మంది వ్యక్తులు తమ ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా తరచుగా ఫ్రెంచ్ ఫ్రైస్‌ తింటున్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా నేటి తరంలో ప్రజలకు ఒక వ్యసనంలా మారటం ప్రమాదకరంగా మారింది. ప్రజలు తీసుకోవడం నియంత్రించడం సవాలుగా చేస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్‌తో ముడిపడి ఉన్న మరో ముఖ్యమైన ఆరోగ్య సమస్య ఊబకాయం. ఆరోగ్యకరమైన స్నాక్స్ తినే వారితో పోలిస్తే తరచుగా ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి బంగాళదుంపలతో చేసే ఆహారాలు తినే వ్యక్తులు త్వరగా బరువు పెరుగుతున్నట్లు లక్ష మందికిపైగా ప్రజలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఫ్రెంచ్ ఫ్రైస్‌లో అధిక స్థాయిలో ఉండే ఉప్పు రక్తపోటును పెంచుతుందని తద్వారా గుండెకు సంబంధించిన అనారోగ్యాలు, హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతుందని వెల్లడైంది. ఫ్రైస్‌లోని అధిక సోడియం కంటెంట్ గుండె, రక్త నాళాలకు ఒత్తిడిని పెంచి హృద్రోగాలకు దారితీస్తుందని తేలింది.

Scroll to Top