బీట్ రూట్ తో బహులాభాలు


బీట్ రూట్ అందరికీ తెలిసిన శాకాహారం.బీట్ రూట్ అందానికి కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్లు, ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అందుకే బీట్ రూట్ ను తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్ ను రెగ్యులర్ గా మోతాదులో తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. బీట్ రూట్ లో నైట్రేట్స్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఈ నైట్రేట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి రక్తపోటును తగ్గించడమే కాదు.. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి జబ్బులను కూడా నివారించడానికి సహాయపడతాయి.బరువు తగ్గేవారికి బీట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో కొవ్వు కూడా తక్కువుంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా బీట్ రూట్ ను రోజూ తినొచ్చు. దీనిలో ఉండే ఫైబర్ కంటెంటే మీకు తొందరగా ఆకలి కాకుండా చేస్తుంది. దీంతో మీరు ఓవర్ గా తినలేరు. బరువు తగ్గడం కూడా సులవు అవుతుంది. బీట్ రూట్ ను తింటే కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో..  బీట్ రూట్ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.బీట్ రూట్ లో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య వచ్చే అవకాశమే ఉండదు. ఇది శరీరంలో రక్తం స్థాయిలను పెంచుతుంది.  దీనిలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.బీట్ రూట్ మన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సంరక్షణగా కూడా ఉపయోగపడుతుంది.దీనిలో విటమిన్ సి వంటి చర్మ సంరక్షణకు అవసరమైన పోషకాలుంటాయి. బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మొటిమలు, ముడతలు, నల్లటి మచ్చలు, మొటిమల మచ్చలు తగ్గిపోతాయి. ఇది  చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. చర్మ రంగు మారడానికి బీట్ రూట్ ఫేస్ ప్యాక్ లను కూడా ఉపయోగించొచ్చు.బీట్ రూట్ కళ్ళ చుట్టూ ఉండే నల్లటి మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం.. బీట్ రూట్ జ్యూస్ లో సమాన మొత్తంలో తేనె, పాలను కలపండి. ఈ మిశ్రమంలో కాటన్ క్లాత్ ను ముంచి కళ్ల మీద పెట్టండి. 15 నిమిషాల తర్వాత ఈ క్లాత్ ను మార్చండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తగ్గిపోతాయి.  బీట్ రూట్ తో పెదాల సంరక్షణ కూడా చేయొచ్చు. ఇందుకోసం బీట్ రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టండి. ఇవి చల్లగా అయిన తరర్వాత  వాటిని పెదవులపై రుద్దండి. దీనితో పెదాలు ఎర్రగా, అందంగా తయారవుతాయి. బీట్ రూట్ ముక్కను తీసుకుని.. దానిపై పంచదార పూసి పెదవులపై రుద్దడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Scroll to Top