ఆగ్రహం లేదా కోపం ఒక సహజ భావోద్వేగం అయినప్పటికీ, దానిని నియంత్రించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు మరియు సామాజిక జీవితం కోసం చాలా అవసరం.కోపం ఒక సహజమైన భావోద్వేగం అయినప్పటికీ, అది నియంత్రణలో లేకుంటే మన శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోపం ఎక్కువ రావడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. హై బ్లడ్ ప్రెషర్, గుండెదడ, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అల్సర్స్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్ర బాగా పట్టకపోవడం, నిద్రలో ఆందోళన చెందడం వంటి సమస్యలు వస్తాయి.తరచుగా తలనొప్పి రావడం. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహోద్యోగులతో విభేదాలు తలెత్తడం. సంబంధాలు చెడిపోవడం.ఒంటరితనం, బేదభావం వంటి భావనలు కలగడం…ఎన్నో దీనివల్ల ఉన్నాయి. సామాజిక జీవితంపై కూదా ఇది ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం.చట్టపరమైన సమస్యలకు గురి కావడం. ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలు తీవ్రతరం కావడం.ఆత్మహత్య ఆలోచనలు కలగడం…దీని పర్యవసానమే.
కోపాన్ని నియంత్రించడం ఎలా అంటే…? యోగా, ధ్యానం వంటివి మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం, నడకకు వెళ్లడం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీరు తాగడం వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సానుకూలంగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించే మార్గాలను వెతకడం. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఒకవేళ కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే, ఒక మనస్తత్వవేత్తను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.