కాలేయాన్ని శుద్ధి చేసే ఆహారం

శరీర భాగాల్లో అత్యంత కీలకమైనది కాలేయం. ఇది ఆహారంలోని పోషకాలను శరీరం ఉపయోగించగలిగే పదార్థాలుగా మారుస్తుంది, ఈ పదార్ధాలను నిల్వ చేస్తుంది. అవసరమైన సమయంలో వాటితో కణాలను సరఫరా చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ బయటకు పోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రకాల ఆహారాలను లివర్ డిటాక్సిఫికేషన్ ఫుడ్స్‌ అంటారు.

కాలేయాన్ని క్లీన్ చేసే ఆహారాల్లో ముఖ్యమైనది బ్రోకలీ. ఇందులో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం వ్యర్థాలను శరీరం నుండి సులభంగా తొలగించే ముఖ్యమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. కాలేయ శుద్ధి ప్రక్రియకు ఇది అత్యంత కీలకం. అదే విధంగా కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ, ఇది కాలేయానికి ఒక అద్భుతమైన ఔషధం లాంటిది. ఇది పిత్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయం పనిని సులభతరం చేస్తుంది. క్యాబేజీ తరహాలో ఉండే కాలేకు పోషక విలువలు అధికంగా ఉండే ఆకుపచ్చని కూరగాయ. ఇందులో విటమిన్లు కె, ఏ, సి లకు శక్తివంతమైన మూలం. ఇది కాలేయ కణాలను బలోపేతం చేస్తుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నివారిస్తుంది.

ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ కి బదులుగా తృణధాన్యాలు ఎంపిక చేసుకోవాలి. కొర్రలు, రాగులు, సజ్జలు, క్వినోవాలో విటమిన్ బి, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ శుద్ధిలో కీలకంగా పనిచేస్తాయి. సుగంధ ద్రవ్యాల్లో పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం, కాలేయం పరిశుభ్రంగా ఉండటం లో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబ్రోసిస్, నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, తీవ్రమైన క్రానిక్ లివర్ గాయాలు, సిర్రోసిస్ వంటి పరిస్థితుల నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. బ్రౌన్ రైస్‌లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

Scroll to Top