కూల్ చేసే కీరా దోస

వేసవిలో లభించే కీరా దోసకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కీరా దోసకాయ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఈ కీరా దోసకాయలు శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. కీరా దోసకాయ తినడం వలన జీరక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధక సమస్యలు అరికడుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. కీరా దోసకాయను ఆహారంలో భాగంలో చేర్చుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే కీరా దోస కీరదోస లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కీరా దోసకాయలో ఉండే మిటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.కీరా దోసకాయలలో ఉండే మిటమిన్ కే వల్ల ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎముకలు బలంగా తయారవుతాయి.చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కీరా దోస నివారిస్తుంది.

చర్మం ముడతలు రాకుండా సహాయపడుతుంది. చర్మం పొడిబారకుండా కాంతివంతంగా ఉంటుంది.. కీరాదోసతో షుగర్ కంట్రోల్ డయాబెటిస్ వ్యాధితో బాధ పడేవారికి కీరా దోసకాయ తినడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది. ఉదయం,మధ్యాహ్నం సమయాల్లో ఆహారంలో కీర దోస కాయను చేర్చుకుంటే మీ షుగర్ కంట్రోల్ అవుతుంది. కీరా దోసకాయలో చాలా పోషకాలు ఉండటం వలన మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. కీరా దోసకాయలను తినడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. కీరా దోసకాయ శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. కీరా దోస మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కీరా దోసలో క్యాన్సర్ ను నిరోధించే గుణాలున్నాయి.కీరా దోస హై బీపీని తగ్గించడానికి, తలనొప్పి వంటి నొప్పుల నుండి ఉపశమనానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

Scroll to Top