ఫిబ్రవరి నెలాఖరు నుంచే రకరకాల విద్యా విషయ పరీక్షల సీజన్ మొదలవుతుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. తల్లిదండ్రుల్లో కూడా టెన్షన్ మొదలైంది. అటు స్కూళ్లలో.. ఇటు ఇంట్లో పిల్లలపై పరీక్షల ఒత్తిడి అన్ని రకాలుగా పెరిగింది. ఇటు పరీక్షలు.. అటు వాటికోసం ఒత్తిడి మధ్య పిల్లలకు ఎలాంటి ఆహారం శక్తిని పెంచుతుంది. మానసికంగా బలాన్ని అందిస్తుంది..అనే విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు . పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని కండిషన్లు పెట్టొద్దని, వారికి మంచి పోషకాహారం అందించాలని సూచిస్తున్నారు.
*పిల్లలకు ప్రత్యేకంగా వాల్ నట్స్, అవిసె గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఈ ఉంటాయి. ఇవి జింక్ ను కూడా అందిస్తాయి. వీటి ద్వారా పిల్లలు మానసికంగా చురుగ్గా ఉంటారని చెబుతున్నారు.
*పరీక్షల సమయంలో లో పిల్లలకు ఓట్స్ కూడా మంచి ఆహారమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఓట్స్ లో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా శక్తిని రిలీజ్ చేస్తాయి. పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు. అందుకే.. వీటిని బ్రేక్ఫాస్ట్గా ఇస్తే మంచిది. ఇవి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. తద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గుతుంది.
*ఆకుకూరలు కూడా పిల్లలకు ఇవ్వటం ద్వారా ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగు పరచడానికి, పిల్లలను రోజంతా చురుగ్గా ఉంచడంలో తోడ్పడతాయి.
*ఫింగర్ మిల్లెట్, బజ్రా వంటి మిల్లెట్స్ కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. ఎగ్జామ్స్ టైం లో పిల్లలకు బెస్ట్ ఫుడ్గా మిల్లెట్స్ ని కూడా చెప్పుకోవచ్చు. ఇవి అధిక ఫైబర్తో నిండి ఉంటాయి. ఇవి ఏకాగ్రతను ప్రోత్సహిస్తాయి. మిల్లెట్స్ పిల్లల జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
*చిక్పీస్, నల్లని శనగలు, మొలకలు శరీరానికి శక్తిని అందించడంతో పాటు.. రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి.
*నారింజ, ద్రాక్షపండు వంటివి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. కాబట్టి పరీక్షల సమయంలో నిపుణులు సూచించిన ఈ ఆహారాలను పిల్లలకు అందించడం శ్రేయస్కరం.
