మంచి పోషకాలు ఉన్న అద్భుతమైన ఆహారం పుట్టగొడుగులు. ఇవి శీతాకాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు. పుట్టగొడుగులను పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, విటమిన్ డి, విటమిన్ బి, సెలీనియం, పొటాషియం వంటి ఖనిజాలు, బీటా గ్లూకాన్స్ తో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే అనేక ఇతర సమ్మేళనాలు కూడా ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. క్యాన్సర్ బారి నుండి మనల్ని కాపాడతాయి. పుట్టగొడుగులు హైబీపీని నియంత్రించి మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. పుట్టగొడుగులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
పుట్టగొడుగులలో క్యాలరీలు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి అంతేకాకుండా మధుమేహం, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు కాపాడతాయి. పుట్టగొడుగులలో ఉండే రిబోఫ్లావిన్, నియాసిన్, పాంటో థినిక్ యాసిడ్లు శరీరంలో జీవక్రియను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.