బాదంతో ఆరోగ్యానికి పండుగ


సంబరాల సంక్రాంతి మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది. పండుగ సీజన్లో విందులు, గాలిపటాలతో కూడిన వేడుకలు ఖచ్చితంగా మన ఉత్సాహాన్ని పెంచుతాయి. అయితే, అతిగా తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందే.

ఈ పండుగ సీజన్‌లో మన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సీజన్లో మేలుచేసే ఆహారాన్ని ఎంపికల చేసుకోవాలి. ఇలాంటి ఆహారంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. బాదం మన శరీరానికి ముఖ్యమైన విటమిన్ ఇ, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, జింక్, ప్రోటీన్ వంటి 15 పోషకాలకు మూలం. ఈ పోషకమైన గింజలను మన రోజువారీ సమతుల్య ఆహారంలో క్రమంతప్పకుండా చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

బాదంపప్పులు ప్రయాణంలో ఉన్నప్పుడు తీసుకువెళ్లి తినగలిగే సౌకర్యవంతమైన ప్రయాణ చిరుతిండి. వీటిని ఆహారం, డెజర్ట్‌లలో అలంకరించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇంకా, బాదంపప్పులను అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఆకలిని సమర్థవంతంగా అరికట్టవచ్చు, బరువు తగ్గడంలో సమర్థవంతంగా ఇది తోడ్పడుతుంది.

పండుగ సీజన్‌లో తమకు ఇష్టమైన స్వీట్‌లు- ఆహారాలను తీసుకోవచ్చు కానీ మితంగా తినాలి. ఏదో ఒక రకమైన వ్యాయామంతో తీసుకున్న కేలరీలు కరిగించాలి. పండుగ/సెలవు కాలంలో కఠినమైన వర్కవుట్‌లలో పాల్గొనకపోవటం ఫర్వాలేదు కానీ యోగా లేదా చురుకైన నడక వంటి తేలికపాటి వ్యాయామాలను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మనం తినే ఆహారంలో బాదం వంటి వస్తువులను చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ఆహారం నుండి శక్తిని విడుదల చేయడంలో ఇవి గుర్తింపు పొందిన పోషకాలు. ఆహారానికి రుచిని జోడించడంతోపాటు, బరువు నిర్వహణ, మధుమేహం నియంత్రణ సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను బాదం అందిస్తుంది. బాదంపప్పును రోజువారీ తీసుకోవడం వల్ల రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ముడతల తీవ్రతను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది అని వైద్యులు చెబుతున్నారు.

Scroll to Top