బొప్పాయి పండ్లు అతిగా తింటే అనర్ధం


బొప్పాయి పండు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలను బ‌య‌టికి పంపిస్తుంది. ర‌క్తం కూడా వృద్ధి చెందుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రంకొన్ని సూచ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహిక‌కు ఎఫెక్ట్ అవుతుంది. క‌నుక ఎప్పుడు ఈ పండును తిన్నా ఒక క‌ప్పుకు మించ‌కూడదు. గ‌ర్భిణీలే కాదు, పాలిచ్చే త‌ల్లులు కూడా బొప్పాయి పండును తింటే వారు ఇచ్చే పాల‌తో ప‌లు ర‌సాయ‌నాలు బిడ్డ శ‌రీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువుల‌కు లోపాల‌ను క‌లిగిస్తాయి. బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తిన‌డం అంత మంచిది కాదు. తింటే స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతుంది. లో బ్ల‌డ్ షుగ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు బొప్పాయి తిన‌రాదు. తింటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఇంకా ప‌డిపోతాయి.

బొప్పాయి పండును ఎవ‌రైనా చాలా త‌క్కువ‌గా తినాలి. రోజూ తిన‌వ‌చ్చు కానీ ఒక క‌ప్పు మించ ‌కూడ‌దు. బొప్పాయి పండ్ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ పండ్ల‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ త‌రువాత ఒక గంట విరామం ఇచ్చి తిన‌వ‌చ్చు. లేదా మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం ఒక గంట విరామం ఇచ్చి తిన‌వ‌చ్చు. బొప్పాయి పండ్ల‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఎ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బొప్పాయి ఎప్పుడు తిన్నా పరిమితంగా.. రోజూ తీసుకుంటే ఆరోగ్య పరమైన ప్రయోజనాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Scroll to Top