ఆహారంతోనే రోగ నిరోధక శక్తి


ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి ఉండాలి. ఇమ్యూనిటీ బాగా ఉంటేనే ఏ పని అయినా సమర్ధవంతంగా చెయ్యగలం. శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పండ్లు,ఆకుకూరలు, కూరగాయలు, గింజ ధాన్యాలు, సీడ్స్, నట్స్ వంటి మంచి పౌష్టిక ఆహారాలను తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం విటమిన్ సి ఉన్న నారింజ,బత్తాయి, నిమ్మ లాంటి జ్యూస్ తీసుకోవడం మంచిది.

ప్రతీరోజూ ఒక గుడ్డు తినటం మేలు చేస్తుంది. గుడ్డు తింటే రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇవి ఆహారంలో భాగం చేసుకుంటే ఇమ్యూనిటీ ఆకుకూరలు, పాలకూర,తోటకూర లాంటి కూరలతో మంచి ప్రయోజనాలు ఉంటాయి.

ఆకుకూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం కోసం బాగా దోహదం చేస్తాయి. ఇక మనం తీసుకునే ఆహారాలలో నట్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నట్స్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తాయి.ఇవి తింటే రోగ నిరోధక శక్తి మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహారంతోనే రోగ నిరోధక శక్తిని మనం బలోపేతం చేసుకోవాలి.

మటన్, చేపలు వంటి వాటిని తినడం కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం,వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారపు అలవాట్లు మన ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం చేత బాడీ తొందరగ డిహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి నీరు శరీరానికి చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అదనపు చక్కెర తగ్గించుకోండి. అదనపు చక్కెర పదార్థాలు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్స్ ను తినకూడదు. ముఖ్యంగా తినే ఆహారపు అలవాట్లు ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయి.

Scroll to Top