
ఉదయం లేవగానే చాలా మందికి కాఫీ తాగడం ముఖ్యమైన అలవాటు. కాఫీ తాగిన 10 నుండి 15 నిమిషాల్లోనే శరీరంపై దాని ప్రభావం ప్రారంభమవుతుంది. మెదడుని ఉత్తేజపరిచే కాఫీని మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేచిన లేచిన వెంటనే కాఫీ తాగితే కొన్ని సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే కాఫీని ఎందుకు తాగకూడదంటే ఆ సమయంలో శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కాఫీ తాగడం వల్ల గాబరా, అతి ఉద్దీపన, కెఫిన్ ఎక్కువగా, త్వరగా అలవాటు పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక నిద్ర లేచిన ఒక గంట తరువాత మొదటి కాఫీని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 గంటల మధ్య సమయంలో తాగే కాఫీ రాత్రి నిద్రకు ఆటంకం క్qఅలిగిస్తుంది. ఇక వ్యాయామానికి ముందు కాఫీ తాగవచ్చు. ఇక సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాఫీ తీసుకోకపోవడమే ఉత్తమం.
కాఫీ స్వల్పంగా మూత్రవిసర్జనను పెంచుతుంది. అందువల్ల నీటిని ఎక్కువగా తాగాలి. కాఫీని ఎక్కువగా తీసుకునే వారు దానిలో చక్కెర, క్రీమ్ వంటి వాటిని వేసుకోకూడదు. అదే విధంగా ఖాళీ కడుపుతో కాఫీని తీసుకోకూడదు. అల్పాహారం తీసుకున్న తరువాత మాత్రమే కాఫీని తీసుకోవాలి. కాఫీని ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య తీసుకోవడమే మంచిది.
కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు లేకపోలేదు. మెదడు పనితీరు, శారీరక పనితీరు మెరుగు పడుతుంది. కాఫీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
