కాలేయం ఆరోగ్యంగా ఉండడం ఎవరికైనా కీలకం. ఎందుకంటే శరీరంలో ఇది చాలా పనులను చేస్తుంది. కాబట్టి కాలేయం ఆరోగ్యం పైన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. కాలేయ ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లను చేసుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునేవారు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
యాపిల్ తోనూ బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక కొన్ని రకాల పండ్లు కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు యాపిల్ తింటే కూడా మంచిది. యాపిల్ తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల కాలేయం డిటాక్స్ అవుతుంది. యాపిల్ కాలేయంలోని ఫ్యాట్ ను కూడా బాగా తగ్గిస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు అవకాడోని తీసుకోవడం మంచిది. అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయాన్ని కాపాడతాయి. కాలేయంలో ఉండే చెడు కొవ్వులను ఇది బయటకు పంపుతుంది.
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెర్రీస్ ను తినాలి. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఏది తిన్నా కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి కాలేయం పైన ఒత్తిడి పడకుండా చేస్తాయి.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో బొప్పాయి కూడా కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయి లో ఉండే విటమిన్లు, ఎంజైమ్ లు కాలేయం పైన పనిభారాన్ని బాగా తగ్గిస్తాయి. కాలేయంలోని ఫ్యాట్ ను దూరం చేస్తాయి. అంతే కాదు కాలేయ ఆరోగ్యం కోసం సిట్రస్ పండ్లను, కివి పండ్లను కూడా తీసుకుంటే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.