శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కీలకమైనది కాలేయం. ఇది శరీరంలో విషకారకాలను తొలగించేందుకు, గ్లైకోజెన్, విటమిన్లు, ఖనిజాల నిల్వలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. పోషకాలను ప్రాసెస్ చేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం అవసరం. మరి, కాలేయానికి మంచి శక్తి.. ఆరోగ్యం ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇటీవలి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లతో లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్ సర్వసాధారణంగా మారుతోంది. ఆ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఆ సమస్యే క్యాన్సర్ గా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు లివర్ క్యాన్సర్ కూడా ఒక ప్రధాన కారణం. వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారంలో అజాగ్రత్తలు కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి అనేక కాలేయ సంబంధిత సమస్యలు ఎంతోమందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాలేయ క్యాన్సర్కు అత్యంత సాధారణ కారణం హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవనశైలి కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
కొన్ని ఆహార పదార్థాలు మద్యం కంటే ఎక్కువగా కాలేయానికి నష్టం చేస్తాయని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం లో అధిక మొత్తంలో ఇనుము, సంతృప్త కొవ్వులు ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది కాలేయ క్యాన్సర్తో నేరుగా ముడిపడి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కూడా కాలేయంలో క్యాన్సర్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మొదట ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమై క్రమంగా క్యాన్సర్ సమస్యగా మారుతుంది. చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ మాత్రమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. జంక్ ఫుడ్స్ రోజూ తీసుకోవడం కాలేయానికి హానికరం. ఇది నాన్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ఉప్పు కాలేయ వాపు తీవ్రతరం చేస్తుంది. ధూమపానం, రెడ్ మీట్ కూడా లివర్ క్యాన్సర్ కు కారణంగా నిలుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
