మధుమేహులు ఖర్జూరపండ్లను మితంగానే తినాలి!
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా డయాబెటిస్ మారింది. ప్రపంచంలో ఉన్న సగం కంటే ఎక్కువ జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినా, తగ్గినా అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఆహారం విషయంలో ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. తినాల్సినవి, తినకూడనివి తెలుసుకుని అందుకు తగినట్టుగా డైట్ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏవైనా పండ్లు తినాలి అనుకుంటే తినొచ్చా .. తినకూడదా… అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇక బాగా తీపిగా ఉన్న పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది అన్న భ్రమలో ఉంటారు. ఇక అలాంటి పండ్లలో ఖర్జూరాలు ఒకటి. అయితే షుగర్ బాధితులు ఖర్జూర పండ్లను తినొచ్చా? లేదా? అన్నది తెలీక చాలా మంది ఖర్జూరాలకు దూరంగా ఉంటారు.
డయాబెటిస్ పేషెంట్లు ఖర్జూరాలు తింటే రోజుకు ఎన్ని పండ్లు తినొచ్చు? ఎక్కువ తింటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం . ఖర్జూరాలతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో డైటరీ ఫైబర్ తో పాటు, విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ బీ6, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ కె, కాపర్, నియాసిన్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటిస్ బాధితులు ఖర్జూరాలను రోజుకు రెండు మాత్రమే తినాలి. మితంగా తింటే పర్లేదు కానీ బాగా ఎక్కువగా తినకూడదు. ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ రోగులకు ఎలాంటి సమస్యని కలిగించదు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే, రక్తంలో చక్కెరలో ఆకస్మిక పెరుగుదల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఖర్జూరాలు కాస్త లిమిట్ లో తినొచ్చు. అలా కాకుండా ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది. ఇంకా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖర్జూరాలు తినటం వలన డయాబెటిస్ కంట్రో లో ఉండటమే కాకుండా బరువు తగ్గుతారు. అధిక రక్తపోటు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.