పంచదార..అనే మాట వినగానే నోరు తియ్యగా అయిపోతుంది. అందుకే, దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు.
పంచదార నోటిని తియ్యగా చేస్తుంది. కానీ, దీనిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎన్నో సమస్యలు వస్తాయి. ఫుడ్‌లో ఎంత చక్కెర తీసుకోవాలి. అసలు మొత్తం చక్కెరని తగ్గిస్తే ఏమేం లాభాలున్నాయో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
*చక్కెర ఎక్కువగా వాడడం వల్ల లివర్‌కి మంచిది కాదు. కాబట్టి, లివర్‌ని కాపాడుకోవాలంటే చక్కెర వాడకాన్ని తగ్గించాలి. దీని వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
*అధిక రక్త చక్కెర స్థాయిలు ఇన్సులిన్ నిరోధకతకి దారితీస్తాయి. ఇది ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిక్‌కి కారణమవుతుంది. కాబట్టి, చక్కెరని ఎక్కువగా తీసుకోకుండా తగ్గించాలి.
*ఎక్కువ చక్కెర తీసుకుంటే అనేక చర్మ సమస్యలు వస్తాయి. అందులో చర్మ సమస్యలకి కారణమయ్యే గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే చర్మం జిడ్డుగా మారుతుంది. మొటిమలు పెరుగుతాయి. కాబట్టి, చక్కెరని తగ్గించండి.
*నోటి బ్యాక్టీరియా ద్వారా చక్కెర విచ్చిన్నమవుతుంది. దీని వల్ల దంతాల ఉపరితలం దెబ్బతింటుంది. ఇది దంత సమస్యలకి కారణమవుతుంది. అంతేకాకుండా చిగుళ్ళ సమస్యలు వస్తాయి. కాబట్టి, చక్కెరని తగ్గించడం మంచిది. ఎక్కువగా చక్కెర తీసుకుంటే మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా ఉండేందుకు పంచదారు బదులు తాజా పండ్లు, గ్రెయిన్స్ తీసుకోవడం మంచిది.
*శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ చక్కెర కారణంగానే పెరుగుతాయి. దీని వల్ల గుండె జబ్బులు పెరుగుతాయి. కాబట్టి, చక్కెరని తగ్గించడం మంచిది. కాబట్టి, షుగర్‌ని తగ్గించండి.
*చక్కెరని తగ్గించడం వల్ల కలిగే లాభాల్లో ముందుగా బరువు తగ్గడం. బరువు పెరగడానికి పంచదార ముఖ్య కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.