చుండ్రుని వదిలించే సులభ మార్గాలు చుండ్రు జుట్టురాలే సమస్యకు దారితీస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. అయితే కొన్ని సులభ మార్గాలతో చుండ్రుని తగ్గించుకోవచ్చు. చుండ్రు వివిధ కారణాల వల్ల వస్తుంది. జుట్టు సంరక్షణపై కాస్త శ్రద్ధ పెడితే దీనిని సలువుగా వదిలించుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ లు చుండ్రును తగ్గించడమే కాదు.. జుట్టు బలంగా, పొడవుగా పెరగడానికి కూడా సహాయపడతాయి. * పెరుగు చుండ్రును వదిలించడంలో ముందుంటుంది. పుల్లని పెరుగును తీసుకుని కొద్దిగా ఉప్పు కలిపి తలకు పట్టించండి. ఒక గంట తర్వాత జుట్టను క్లీన్ చేసుకోండి. ఈ పద్దతిని తరచుగా ఫాలో అవ్వడం వల్ల చుండ్రు తొందరగా వదిలిపోతుంది. * చుండ్రును తొలగించడంలో నిమ్మరసం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని దానికి అరకప్పు పెరుగు, ఒక టీస్పూన్ తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి. * కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాదు.. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా పాడుతుంది. కలబంద గుజ్జు జుట్టు పొడుగ్గా పెరిగేందుకే కాదు.. చుండ్రును కూడా వదిలిస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును మాడుకు అప్లై చేసి కొద్ది సేపు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. * ఆముదం నూనె, ఆలివ్ నూనెను సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చగా చేసి నెత్తికి అప్లై చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ తో మీ తలను కవర్ చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు నూనెను అప్లై చేయడం వల్ల చుండ్రు వదిలిపోతుంది. * వేప ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వేపాకులతో చుండ్రును వదిలించుకోవడానికి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి జుట్టు మొత్తానికి అప్లై చేయండి. వారానికి ఒక సారి ఈ హెయిర్ ప్యాక్ వేయడం వల్ల చుండ్రు తొందరగా వదిలిపోతుంది.