బీపీని అదుపులో ఉంచాలంటే!


ప్రస్తుత సమాజంలో ఎంతో మంది హైబీపీ బారినపడి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామందికి బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా బీపీ తగ్గడం లేదు. అటువంటివారు బీపీని సహజ పద్దతుల్లో అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* బిపిని నియంత్రణలో ఉంచడం కోసం ముందు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి.
* తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. అధిక ఉప్పు, కారం వినియోగం వల్ల బీపీ కంట్రోల్ కాదు. బిపి కంట్రోల్ చేయడం కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా శారీరక వ్యాయామం చేయాలి. ఇవి కంట్రోల్ చేస్తే బీపీ కంట్రోల్ అవుతుంది రోజు కనీసం ఒక అరగంట పాటైనా యోగా, ధ్యానం వంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వీటివల్ల కూడా సహజంగా బీపీ తగ్గే అవకాశం ఉంటుంది.
* బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ధూమపానం, మద్యపానం వంటివి మానేయాలి. ధూమపానం, మద్యపానంతో బిపి మరింత పెరుగుతుంది. అందువల్ల వీటిని మానేయడం మంచిది.
* విపరీతంగా బరువు పెరిగిన వారిలోనూ బీపి కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. బరువు తగ్గడంపైన దృష్టి సారించాలి. ఆందోళన, ఒత్తిడి వంటివి బీపీని బాగా పెంచుతాయి. టెన్షన్స్ ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్ పెరుగుతుంది. కనుక వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. * సరిగ్గా నిద్రపోని వారిలో కూడా బీపీ బాగా పెరుగుతుంది. కనుక ప్రతిరోజు కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. *ఈ నియమాలన్నీ పాటించినప్పటికీ బీపీ తగ్గకపోతే మరోమారు వైద్యుని వద్దకు వెళ్లి సలహా తీసుకొని మందులు వాడాలి. బీపీని నిర్లక్ష్యం చేస్తే అది పక్షవాతానికి, శరీరంలోని ముఖ్య అవయవాల డ్యామేజ్ కు దారి తీసే ప్రమాదం ఉంది.

Scroll to Top