మధుమేహ నియంత్రణకు ఎన్నో మార్గాలు


ఇప్పుడు చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య మధుమేహం (డయాబెటిస్). ఆయుర్వేదంలో మధుమేహ నియంత్రణకు కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహ నియంత్రణ చేయాలనుకునేవారు రాగి పాత్రలో నీటిని తాగడం చాలా మంచిది అంతే కాదు వంట చేసేటప్పుడు కూరల్లో ఆవాలు, పసుపు, మెంతిపొడి, దాల్చిన చెక్కపొడులను వేస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు అమాంతం పెరిగిపోకుండా అవి కట్టడి చేస్తాయి. వండుకునే కూరను బట్టి వాటిల్లో మనం పైన పేర్కొన్న కొన్ని పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకుంటే మంచిది. మధుమేహ నియంత్రణకు కరివేపాకు ఎంతో బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. కరివేపాకు తినడం కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. వేపాకు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో మెంతులను చేర్చితే లేదా మెంతుపొడిని చేర్చితే, మెంతికూరతో కూరలు వండుకుంటే మధుమేహ నియంత్రణ అవుతుందని చెబుతున్నారు. కాకరకాయలను కలబందను తరచుగా తీసుకోవడం వల్ల కూడా మధుమేహ నియంత్రణ అవుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఉసిరికాయలు తినడం లేదా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కూడా మధుమేహ నియంత్రణలో ఉంటుంది. అన్నం తినేటప్పుడు కొంచెం అన్నంలో దాల్చిన చెక్క పొడిని కానీ, మెంతి పొడిని కానీ కలుపుకొని తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేస్తే కూడా మధుమేహ నియంత్రణకు మంచిది.

Scroll to Top