మామిడిపండ్లు తినడం మంచిదే, కానీ!
పండ్లలో రారాజు మామిడిపండు. దీనికోసం సంవత్సరమంతా కాపు కాసేవారు కూడా ఉంటారు. చాలా మంది ఇష్టంగా తింటారు. మరీ వీటిని తింటే చక్కెర స్థాయిలు, బరువు పెరుగుతాయని కొంతమంది అంటారు. ఇందులో నిజమెంతో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం!
*మామిడిపండ్లు తీసుకుంటే షుగర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అంతగా పెరగవు. 12 వారాల పాటు షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తింటే రక్తంలో చక్కెర లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకునేవారికి ఈ మామిడిపండ్లు మంచివే అని చెబుతున్నారు.
*మామిడిపండ్లలోని చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే కాస్తా జాగ్రత్తగా ఉండాలి. మామిడిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు సహజ చక్కెరలు ఉంటాయి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంటుంది. తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవారికి ఇవి ఈజీగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా పోషకాలని నెమ్మదిగా గ్రహిస్తాయి. చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి.
*మామిడిపండ్లలోని చక్కెర శాతం శరీర బరువుని పెంచితుందనుకుంటారు. కానీ, కేలరీలని కౌంట్ చేసుకుంటే మాత్రం తక్కువగా తీసుకోవాలి. మామిడిపండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఓ మీడియం సైజ్ మామిడిపండ్లలో 150 కేలరీలు ఉంటాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి కడుపు నిండుగా ఉంటుంది. మామిడిపండ్లలో డైటరీ ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కడుపు నిండుగా, వెయిట్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని కంట్రోల్ చేస్తుంది. ఇందులోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మంచివి.
*షుగర్ లెవల్స్, శరీర బరువు గురించి ఎక్కువగా భయపడొద్దు..కానీ, ఒకసారి ఈ పండ్లు తింటే… మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాబట్టి, మోతాదులో తినాలి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. సహజ చక్కెరలు బ్యాలెన్స్ చేయడానికి ఫైబర్, ప్రోటీన్ ఫుడ్స్‌తో కలిపి తినొచ్చు. పెరుగు, సలాడ్ పచ్చి కూరగయాలు, గ్రిల్డ్ చికెన్, టోఫు ఇలాంటి వాటితో బ్యాలెన్స్ చేయండి.
*తినేటప్పుడు మామిడిపండ్లు బాగా పండినవే తీసుకోండి. ఇవి మంచి వాసన, రుచిని కలిగి ఉంటాయి. వీటి వల్ల స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. వీటిలో కృత్రిమ చక్కెరలని కలిపి తినొద్దు. ముఖ్యంగా మామిడి రసం, క్యాన్డ్ మ్యాంగ్ సిరప్‌లో కేలరీలు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు వివరిస్తున్నారు.