మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరానికి ఎంతో బాగా దోహదం చేస్తాయి. మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ రాకుండా మిరియాలు కాపాడుతాయి. మిరియాలు పోషకాల శోషణ పెంచుతాయి. మిరియాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నరాల సంబంధిత సమస్యలు ఉన్నవారు మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిరియాలు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు బరువు తగ్గడానికి మిరియాలు ఎంతో బాగా దోహదం చేస్తాయి. గొంతు నొప్పి జలుబు, వైరల్ ఫీవర్ వంటి ఇబ్బందులతో బాధపడేవారు మిరియాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మిరియాలలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. మిరియాలలో విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కే, కాపర్, ఐరన్, మాంగనీస్ ఉంటాయి. మిరియాలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువగా ఉంటాయి.
మిరియాలు యాంటీసెప్టిక్ గా ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ తో బాధపడే వారికి కూడా మిరియాలు, కీళ్లవాతం నుంచి ఉపశమనం పొందడానికి దోహదం చేస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.