విటమిన్స్ పోకుండా ఎలా వండాలి

విటమిన్స్ పోకుండా కూరగాయల్ని ఎలా వండాలంటే?

కూరగాయలను వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాటిలోని పోషకాలు అలానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కూరగాయలను వండడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గుతాయన్న చర్చ చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఫ్రై నుంచి ఉడకబెట్టడం, కాల్చడం, గ్రిల్ చేయడం, ఆవిరి చేయడం వరకూ కూరగాయలు వండేందుకు ఉపయోగించే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. తాజా కూరగాయలలో సహజంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు రోజువారీ ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ మొదలైన వివిధ దీర్ఘకాలిక వ్యాధులని తగ్గించొచ్చు.

కూరగాయలను ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు పోతాయని నివేదికలు చెబుతున్నాయి. కూరగాయలను వండే విధానం వాటి పోషకాలను మార్చగలదు. ఉదాహారణకు బి, సి వంటి నీటిలో కరిగే విటమిన్లు వంట పద్దతులకు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ విటమిన్లని ఉడకబెట్టినప్పుడు కూరగాయల నుండి బయటకు వెళ్ళిపోతాయి. వేడి వల్ల అధోకరణం చెందుతాయి. అయితే, ఎ, డి, ఈ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్ల విషయానికొస్తే అవి వంట ప్రక్రియలో మెరుగ్గా పనిచేస్తాయి. ఖనిజాల విషయానికొస్తే, వేడి కొన్ని జీర్ణక్రియ, శోషణ, జీవక్రియని మెరుగుపరుస్తుంది.

కూరగాయలను వండినప్పుడు వాటిలోని రసాలు పోతాయి. ఇవి ఆహారంలో పెద్ద విటమిన్లను దూరం చేస్తాయి. అంతేకాదు, కూరగాయల గ్రిల్లింగ్ ప్రక్రియలో 40 శాతం బి విటమిన్స్ పోతాయి. అలాగే, చాలా కూరగాయల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి విషయానికొస్తే ఉడకబెట్టినప్పుడు తగ్గుతుంది.

పచ్చి కూరగాయల్లో కొన్ని చాలావరకూ పోషకాలను ఇస్తాయి. ఎందుకంటే కూరగాయలను ఉడికించడం వల్ల విటమిన్స్, మినరల్స్ వంటి సహజ ఎంజైమ్స్ నాశనం అవుతాయి. అంతేకాకుండా, నూనె, మసాలాలు ఆహారాల పోషకాలను ప్రభావితం చేస్తాయి. కూరగాయలు రుచికరమైనవి అయినప్పటికీ, పచ్చి కూరగాయలు ఎక్కువ ఫైబర్, పోషకాలను అందిస్తాయి. అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలు ఎక్కువగా తినాలి.

కూరగాయల్లోని పోషకాలు పోవడానికి కారణాలలో వాటిని అతిగా ఉడికించడం ఒకటి అని నిపుణూఇ చెబుతున్నారు. చాలా మంది కూరగాయలను ముందుగా కట్ చేసి ఆ తర్వాత వాటిని కడగుతారు. ఆ సమయంలో పోషకాలు వెళ్ళిపోతాయి. దీని బదులు ముందుగానే కూరగాయలను కడిగి ఆ తర్వాత కడగాలి. అప్పుడు అందులోని ఫైబర్ అలానే ఉంటుంది. అదే విధంగా చాలా మంది కూరగాయలను చాలా సార్లు నీటిలో నానబెడతారు. అలా ఎక్కువ శాతం నానబెట్టకూడదు. ఎందుకంటే కూరగాయల్లో అప్పటికే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలా నీటిని నానబెట్టడం వల్ల ఖనిజాలు పోతాయి. కూరగాయలు వండేటప్పుడు ఇలా చేయకూడదని నిపుణుల మాట.

Scroll to Top