హైబీపీతో కంటికి ముప్పు


ప్రస్తుత సమాజంలో  అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం హైపర్‌టెన్షన్. అపసవ్యమైన జీవన శైలితో యువతలో అధిక రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు, లివర్, గుండె వంటి అవయవాల పైనే కాకుండా కళ్ళ ఆరోగ్యాన్ని కూడా త్వరగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*హైపర్ టెన్షన్ కంటి సమస్యలకు సంబంధించి సైలెంట్ కిల్లర్ గా మారుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అధిక రక్తపోటు కళ్ళలో రక్తనాళాలను దెబ్బతీస్తుంది. తద్వారా ఇది హైపర్‌టెన్సివ్ రెటినోపతి వంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఫలితంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది.
*చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది అంధత్వానికి దారితీస్తుంది. అందుకే హైపర్ టెన్షన్ ను ప్రారంభ దశలోనే గుర్తించి మందులు వాడడంతో పాటు, కంటి పరీక్షలు  చేయించుకోవాలి.
*సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి అంశాలు ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలుగా మారుతున్నాయి. యువత జీవన శైలి పై నిర్లక్ష్యం వహించి, హైపర్ టెన్షన్ సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
*అధిక రక్తపోటు రెటీనా లోని రక్తనాళాల పైన ఒత్తిడి పెంచి వాటిని దెబ్బతినేలా చేస్తాయి. రక్తనాళాలు దెబ్బ తిన్నప్పుడు ఒక్కొక్కసారి రక్తస్రావం అవుతుంది. దీనివల్ల ఒక్కొక్కసారి కంటి తెల్ల భాగంలో రక్తపు మచ్చలు కనిపిస్తాయి. రెటీనా దెబ్బతినడం వల్ల దృష్టి మసకబారడం లేదా దృష్టి లోపం ఏర్పడుతుంది. అధిక రక్తపోటు కారణంగా ఒక్కొక్కసారి కంటికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది చూపును శాశ్వతంగా కోల్పోయేలా గా చేస్తుంది.
*అధిక రక్తపోటు  చూపు మందగించడానికి కారణమవుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కంటి సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హైబీపీని కంట్రోల్ చేసుకోవాలి. సరైన జీవన శైలిని పాటించడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

Scroll to Top