ప్రస్తుత సమాజంలో అనారోగ్యమైన జీవన శైలి కారణంగా ఆహారం తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. సమయానుకూలంగా ఆహారం తీసుకోవడం చాలా మంది మర్చిపోయారు. రాత్రి డిన్నర్ తర్వాత పడుకుంటే అనారోగ్యం ఇక రాత్రిపూట డిన్నర్ ఎవరి ఇష్టం వచ్చిన సమయానికి వారు తింటున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా తింటున్న వారు లేకపోలేదు. అయితే రాత్రి వేళ డిన్నర్ చేసిన తర్వాత వెంటనే బెడ్ ఎక్కేస్తున్నారు. చిన్నపాటి వ్యాయామం కూడా చేయరు. ఇలా రాత్రి పూట డిన్నర్ చేసిన తర్వాత ఎటువంటి వ్యాయామం లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిన్నర్ చేసిన తర్వాత కచ్చితంగా కాసేపైనా నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్ చేసిన తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుందని, మంచి నిద్ర పడుతుందని దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. డిన్నర్ తర్వాత కచ్చితంగా 15 నుంచి 20 నిమిషాలు నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. డిన్నర్ తర్వాత నడకతో స్ట్రెస్ రిలీఫ్, సుఖ నిద్ర శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. కండరాలకు కూడా మేలు జరుగుతుంది. రాత్రివేళ జీర్ణవ్యవస్థ సహజంగా మందకొడిగా ఉంటుంది. కానీ డిన్నర్ తర్వాత నడవడం వలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య తలెత్తదు. కొన్నిసార్లు ఒత్తిడి వల్ల కూడా రాత్రిపూట నిద్ర పట్టదు. అయితే రాత్రివేళ భోజనం చేసిన తర్వాత ఒత్తిడి తగ్గేందుకు కొద్దిసేపు నడక సహకరిస్తుంది.
డిన్నర్ తర్వాత నడకతో బీపీ, షుగర్ కంట్రోల్ మంచి నిద్ర పట్టేందుకు నడక ఉపయోగపడుతుంది. రాత్రి తిన్న తర్వాత నడవడం వల్ల బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు డిన్నర్ చేసిన తర్వాత నడవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండి, షుగర్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక డిన్నర్ చేసిన తర్వాత నడక బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుందని నిపుణులు వివరిస్తున్నారు.