‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే ప్రాచీన సూక్తి అందరికీ తెలిసినదే. ఎవరికైనా కళ్లు చాలా ప్రధానమైనవి. అవి లేని ( చూపులేని) అంధకారమైన జీవితాన్ని ఊహించడానికీ ఎవరూ సాహసించరు. అందుకే కళ్లల్లో వెలుగు ఆరిపోనివ్వకుండా కాపాడుకోవడం చాలా అవసరం. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి!
చదివే సమయంలో
పుస్తకాన్ని 30 సెం.మీ. దూరంలో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి. కదులుతున్న కుర్చీలో కూర్చొని చదివితే కళ్ళకు శ్రమ కలుగుతుంది. బస్సుల్లోనూ, ట్రైన్లలోనూ ప్రయాణిస్తున్నప్పుడు చదివే ప్రయత్నాలు చేయకూడదు.
Reading-vs Computer-Glassesకంప్యూటర్‌పై పని చేస్తుంటే ..
– కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన చూపు నిల్పి పనిచేయాలి.
– కంప్యూటర్ మానిటర్ ముందు కనురెప్ప వేయకుండా పనిచేయడం మంచిదికాదు. తరచుగా రెప్పలు మూసి తెరుస్తుండాలి. నిరంతరం అదే పనిలో ఉండకుండా మధ్యలో వీలైనంత పనిచేయకుండా మధ్యలో విరామాన్ని ఇవ్వాలి.
– కంప్యూటర్ ముందు కాళ్లు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచేలా కూర్చోవాలి. మీ చూపును స్క్రీన్‌పై మరీ అంత తీక్షణంగా నిల్పకూడదు.
– కంప్యూటర్ స్క్రీన్ కన్నా పరిసరాలు మరింత కాంతివంతంగా కనిపించేలా మానిటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుంటే మంచిది
టెలివిజన్ చూసేటప్పుడు
– ఒక గంటకు మించి అదేపనిగా టీివి చూడడం కళ్లకు మంచిదికాదు.
– టీవీ చూస్తున్నపుడు శరీరాన్ని రకరకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు, Image:అయితే వెన్నెముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చొని టీ.వీ. చూడడం కొంతవరకూ కంటికి మేలుచేస్తుంది.
– టీవీ చూసేటపుడు కనీసం మూడు మీటర్లు దూరంలో ఉండాలి.
– చీకటి గదిలో టీవిచూడడం కంటికి మంచిది కాదు. టీవి చూస్తున్నపుడు గదిలో తగినంత వెలుతురు ఉండాలి. ఆ లైటు కూడా టీవీ వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.
డ్రైవింగ్ సమయంలో
వాహనాన్ని నడిపే సమయంలో సన్‌గ్లాసెస్‌ని వాడాలి.సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత (యు.వి) కిరణాల తాకిడికి కళ్లకు హాని కలగకుండా, దుమ్ము, ధూళి పడకుండా కళ్లకు రక్షణగా ఉంటాయి.
రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాసెస్ వాడాలి. అవి ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి