నిద్రలేమిని అధిగమించాలంటే..? బి12 విటమిన్ అత్యంత అవసరం
శరీరంలో బి12 విటమిన్ లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో విటమిన్ బి12 లోపం నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. ఇటువంటి లోపం ఉన్నవారు సరిగా నిద్రపోలేరు. ఫలితంగా రోజంతా వారు అలసటను ఫీలవుతారు. కాబట్టి విటమిన్ బి12 లోపం ఉన్నవారు విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు.
శాకాహారం తినే వారైతే విటమిన్ బి12 కోసం బచ్చలికూర, బీట్రూట్, పుట్టగొడుగులు, బంగాళదుంపల వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇక మాంసాహారం తినే వారైతే విటమిన్ బి12 కోసం ట్యూనా చేప, సాల్మన్ వంటి చేపలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఉడికించిన కోడిగుడ్లను తినడం వల్ల కూడా విటమిన్ బి 12 లభిస్తుంది.
ఉడికించిన కోడిగుడ్లలో పచ్చసొన లోనే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ బి12 కావలసినవారు ఉడికించిన కోడిగుడ్లను తినాలి. పాలు, పెరుగు మరియు చీజ్ వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి12 కాకుండా ప్రోటీన్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఈ ఆహార పదార్థాలలో కనిపిస్తాయి.
ఇలా విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ విటమిన్ బి12 లోపం లేకున్నా నిద్రలేమి సమస్య వేధిస్తుంటే వారు తప్పనిసరిగా వైద్యుని సందర్శించి తగిన చికిత్స తీసుకోవాలి.