చిత్ర పరిశ్రమలో మరో విషాదం

ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూతతెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కె.విశ్వ‌నాథ్ లేర‌న్న నిజాన్ని దిగ‌మింగుకొంటున్న స‌మ‌యంలోనే ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌ని వాణీజ‌య‌రాం కూడా అశేష సినీ అభిమానుల్ని వ‌దిలి వెళ్లిపోయారు. వాణీజ‌య‌రాం శనివారం ఉదయం క‌న్నుమూశారు. ప్ర‌మాద‌వ‌శాత్తూ వాణీ జ‌య‌రాం త‌ల‌కు గాయం అవ్వ‌డంతో ఆమెను చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చేర్పించారు. అయితే ఈలోపుగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఇటీవ‌లే ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె వ‌య‌సు 78 సంవ‌త్స‌రాలు.తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న ఆమె జన్మించారు. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలను వాణీజయరాం చక్కగా పాడేవారు.వాణీజయరాం ఎనిమిదో ఏటనే సంగీత కచేరి నిర్వహించారు. మద్రాస్ క్వీన్స్ మేరీ కళాశాలలో పట్టా పుచ్చుకున్నారు. ఆమె పదేళ్ల వయస్సులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడారు. తొలిపాటకే తాన్ సేన్, మరో 4 అవార్డులు అందుకున్నారు. 14 భాషల్లో దాదాపు 8 వేలకుపైగా పాటలను వాణీజయరాం పాడారు. ఆమె మూడుసార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు.మొదటి సారిగా 1970లో గుడ్డీ సినిమా ద్వారా నేపథ్య గాయనిగా మారారు.  అపూర్వ రాగంగళ్‌ శంకారాభరణం(మానస సంచరరే)స్వాతికిరణం(ఆనతినియ్యరా హరా)పాటలకు వాణీజయరాం మూడు సార్లు జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నారు.  వాణీజయరాం తెలుగు హిందీ తమిళ మలయాళ గుజరాతీ మరాఠీ ఒరియా భోజ్‌పురీ…ఇలా 14భాషల్లో దాదాపుగా 10వేలకు పైగా పాటలు ఆలపించారు.  వాణీ జయరాం మరణం పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top