టాలీవుడ్ నటులతో క్రికెట్ కార్నివల్

దక్షిణ భారతదేశం నుండి టాలీవుడ్ చలనచిత్ర నటులు మొదటిసారిగా మెల్బోర్న్ విచ్చేసి బహుళ సంస్క్రుతిని విస్తరించే భాగంగా T20 క్రికెట్ మ్యాచ్ Chirnside Park Werribee లో సుమారు 2000 మంది అభిమానుల ముందు ఆడారు.

సెలిబ్రిటీ క్రికెట్ కార్నివాల్, ఆస్ట్రేలియా అధ్యక్షులు శ్రీ సాయి కృష్ణ అధ్వర్యంలో నాలుగు రోజుల క్రికెట్ సంబరాలు జరిగాయి.
పాయింట్ కుక్ లో టాలీవుడ్ నటులందరూ 450 మంది అభిమానులతో కలిసి మీట్ & గ్రీట్ డిన్నర్ కార్యక్రమాన్ని నిర్వహించి వారితో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. వారందరూ గ్రేట్ ఓషన్ రోడ్, మెల్బోర్న్ నగరం మరియు బలారట్ లోని వన్యప్రాణుల పార్క్ ని సందర్శించారు.

ఆట మొదలవ్వక ముందు అందరి సమక్షంలో శ్రీ సాయికృష్ణ గారు రాయల్ చిల్ద్రెన్ వైద్యశాలకు $5000 విరాళంగా ఇచ్చారు.
ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హోక్లె, విక్టోరియ రాష్ట్ర క్రికెట్ అధ్యక్షులు రాస్ హేప్బుర్న్, టోబీ విలియమ్స్, జేమ్స్ రోజ్ గార్టెన్, కెన్ జాకబ్స్ మరియు Chirnside Park Werribee Cricket club అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టైటిల్ స్పాన్సర్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్, చలనచిత్ర నటులందరినీ మెల్బోర్న్ నగరం తీసుకొచ్చినందుకు ANZ కంట్రీ మేనేజర్ SP మోహన్ గారెని, వీసా ఏర్పాట్లు చేసినందుకు ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ కు, అందరికీ భోజన వసతులు ఏర్పాటు చేసినందుకు సింప్లీ ఇండియన్ రెస్టారెంట్ వారికి మరియు ఈ కార్యక్రమ నిర్వహణలో ఆర్ధికంగా, స్వచ్చందంగా సేవలందించిన మరెంతో మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నిర్ణీత 20 ఓవర్లలో అజయ్ టీం 168 రన్స్ చేసారు. అయితే స్టార్స్ 19.3 ఓవర్లలో ఈ స్కోర్ ని చేసి విజయం సాధించారు.
ఉత్తమ బాట్స్ మాన్: అశ్విన్ బాబు, ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడు: ప్రైస్ సెసిల్, మాన్ అఫ్ ది మ్యాచ్: SS తామన్
Celebrity Cricket Carnival T20 నిర్వహణ క్రికెట్ ఆస్ట్రేలియా సహోద్యోగులు యోహన్ జయసింహ, కీత్ థాంప్సన్ మరియు శేఖర్ గార్లచే జరిగింది.

మళ్ళీ రెండవ సీసన్ కోసం చలనచిత్ర నటవర్గం ఈ సంవత్సరం అక్టోబర్/నవంబర్ నెలల్లో మళ్ళీ వస్తారు.

Scroll to Top