తూర్పు తీరంలో తెలుగు రేఖలు


“ఈ పుస్తకం చదవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. విదేశాలలో ఎంతోమంది ప్రముఖులున్నప్పటకి వారి సేవలు,వారి గొప్పతనం తెలియజెప్పే ప్రయత్నానికి మీ పుస్తకం స్పూర్తినివ్వాలి.”
మండలి బుద్ధప్రసాద్, పూర్వ ఉప శాసనసభాపతి, ఆంధ్రప్రదేష్ రాష్ట్రం

“ఆస్ట్రేలియాలో తెలుగువారి చరిత్ర, సంస్కృతిపై ఆసక్తి ఉన్న పరిశోధకులు ఈ గ్రంథంపై పి.హెచ్.డి. పరిశోధన చేస్తే బాగుంటుంది.”
ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ, డి.లిట్,
పూర్వ ఉపకులపతి, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము
https://www.acchamgatelugu.com/2023/10/toorpu-teeramlo-velugu-rekhalu.html

“ఈ గ్రంథం చాలా దేశాలలో ఉన్న ప్రవాస తెలుగువారికి కరదీపికలా ఉపయోగపడుతుంది.  తద్వారా వారు కూడా తమ గతాన్ని రికార్డు చేయడానికి స్పూర్తికారకమౌతుంది.”
కవి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, అనువాదకారుడు – రాపోలు సీతారామరాజు, దక్షిణాఫ్రికా
https://www.ntnews.com/editpage/turpu-teeramlo-telugu-rekhalu-book-review-1260444

“ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా చదవదగిన పుస్తకం.  అంతే కాదు, ఆస్ట్రేలియా వెళ్ళే తెలుగువారికి ఈ ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకం ఒక కరదీపికలా ఉంటుంది”
సాక్షి వార్తా పత్రిక
https://www.sakshi.com/telugu-news/nri/telugu-book-release-toorpu-teeram-lo-telugu-rekhalu-1807409#google_vignette

“ఇటువంటి గ్రంథాలు ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు కూడా ముద్రిస్తే ఎంతో బాగుంటుంది.”
డా. తెన్నేటి సుధా దేవి, పూర్వ సహాయ  సంచాలకులు, తెలుగు అకాడమీ మరియు ప్రముఖ రచయిత్రి

“‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పేరుతో మల్లికేశ్వరరావు కొంచాడ రాసిన ఓ గ్రంథం మీ ఆరాటాలు, ఆసక్తులు, ఆరాలు, కుతూహలాలన్నిటికీ సరైన సమాధానం.”
G.రాజసుక, ఉప సంపాదకులు

Sahithi Vanam: తూర్పు తీరంలో తెలుగు రేఖలు

“‘ప్రవాసంలో పెళ్ళి ప్రహసనం’ భలే సరదాగా అలరించింది. ఈ కథతో పాటుగా పాఠకులు కూడా ఒకసారి అలా ఆస్ట్రేలియాలో రంగనాథం ఇంటికి వెళ్లిరావడం ఖాయం. పాయసంలో జీడిపప్పులా, సంభాషణలలో చక్కటి తెలుగు సామెతలు రుచికరంగా ఒదిగిపోయాయి. భార్యాభర్తల సంభాషణలు చాలా హాస్యభరితంగా సహజంగా అమరిపోయాయి. “ఈ మధ్య నిశ్శబ్దమే ఎక్కువ శబ్దం చేస్తోంది”, “చీకటిలో కోపం కనిపించలేదు కానీ మాటలో కరుకుదనం వినిపించింది”, “ముఖంలో వెలిగిన చిరునవ్వు పెదవులు దాటనివ్వలేదు” “వెళ్తే పని, లేకపోతే జీతం” వంటి ప్రయోగాలు ప్రత్యేకించి నన్ను ఆకట్టుకున్నాయి.”
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వక్త మరియు వ్యాఖ్యాత రాధిక మంగిపూడి
https://epaper.prajasakti.com/view/?date=2023-10-30&edition=3&pg_no=4

“Mallikeswara Rao Konchada, also known for his poetry, stories, and plays, is a very talented writer.
In his upcoming book ‘Toorpu Teeram lo Telugu Rekhalu,’ which is releasing on October 1st in Melbourne, he showcases Telugu traditions from the eastern shore. His enthusiasm, combined with our interest, led to the creation of this book.”
SBS తెలుగు – ఆస్ట్రేలియా
https://www.sbs.com.au/language/telugu/en/podcast-episode/toorpu-teeram-lo-telugu-rekhalu/x1bl2zs0q

వికీపీడియాలో…
https://te.wikipedia.org/wiki/తూర్పు_తీరంలో_తెలుగు_రేఖలు



ఆస్ట్రేలియాలో తెలుగువారు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తెలుగుమల్లి దశ వసంతాల కానుకగా తెలుగుమల్లి సంపాదకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు (రావు కొంచాడ) ప్రచురించిన “తూర్పు తీరంలో తెలుగు రేఖలు” పుస్తకం అక్టోబర్ 1 వ తేదీన మెల్బోర్న్ నగరంలోనూ,  అక్టోబర్ 7 వ తేదీన సిడ్నీ నగరంలోనూ మరియు అక్టోబర్ 15 వ తేదీన కేన్బెర్రా నగరంలోనూ వివిధ కార్యక్రమాలలో ఆవిష్కరింపబడింది.  భారతదేశంలోను, ఆస్ట్రేలియా లోను వివిధ మాధ్యమాలలో వచ్చిన సమీక్షలు పైన సంక్షిప్తంగా పొందుపరచబడ్డాయి.

ఈ గ్రంథంలో ముఖ్యంగా దశల వారీగా 1960 నుండి 2020 వరకు ఒక్కొక్క దశకంలో వచ్చిన  వలసదారులు,  వారు ఎదుర్కొన్న కష్టాలు, ఆస్ట్రేలియా ప్రభుత్వ వలస విధానంలో వచ్చిన మార్పులు, వివిధ రంగాలలో తెలుగువారు చేసిన కృషి “వలస ప్రయాసలు” వ్యాసంలో సుదీర్ఘంగా వ్రాసారు.  తరువాత “మాతృభాషా వికాసాలు”, “సాహిత్య ప్రభాసాలు” వ్యాసాలలో అక్కడ జరుగుతున్న భాషా, సంస్కృతుల వికాసాన్ని సమగ్రంగా  విపులీకరించారు.  “పెళ్ళిళ్ళ ప్రహసనం” ఒక హాస్యభరితమైన  కథ రూపంలో అక్కడ జరిగిన పెళ్ళిళ్ళ తంతు చక్కగా వివరించారు.

విజ్ఞాన వీచికలు విభాగంలో ఎంతోమంది తెలుగు ప్రముఖులు అక్కడి సమాజానికి అందించిన సేవలు మరియు వారి ప్రతిభా విశేషాలను విశదీకరించారు.  ఈ విభాగం ఎంతో నేర్పుతో కూర్చడం బాగుంది.

“తెలుగు సంస్థలు – వెలుగు వ్యవస్థలు” శీర్షికన అక్కడి వివిధ నగరాలలో ఉన్న తెలుగు సంఘాల గురించి, “తెలుగు బడి – తెలుగు నుడి” శీర్షికన అక్కడి తెలుగుబడుల గురించి కూలంకుషంగా వ్రాసారు.  మాధ్యమ సాధ్యమాల శీర్షికన అక్కడ వివిధ రకాలైన వార్తా పత్రికలు, రేడియోలు, ఇతర మాధ్యమాల గురించి సవివరమైన సమాచారం అందించారు.

చివరగా “అతిథుల అభిప్రాయాలు”  శీర్షికన భారతదేశం నుండి అక్కడ తరచుగా పర్యటించిన కొంతమంది అభిప్రాయాలను కూడా పొందుపరిచారు.  వివిధ పట్టణాలలో ఉన్న  సంగీత నృత్య కళాశాలల వివరాలు కూడా ప్రచురించడం జరిగింది.

“ఇది విన్నారా” శీర్షికన టూకీగా గత అరవై ఏళ్లలో కనుమరుగైపోయిన కొన్ని ప్రక్రియలు/ వస్తువులు గురించి ప్రస్తావించడం జరిగింది.

ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో ప్రచురించి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు అందివ్వాలన్న అంతిమ లక్ష్యంగా రచయిత శ్రీ రావు కొంచాడ గారు ప్రస్తుతం పని చేస్తున్నారు.

ఈ పుస్తకం రూపుదిద్దటంలో సహాయ సహకారాలందించిన శ్రీ బెందాళం కృష్ణారావు గారికి, లే అవుట్ డిజైన్ చేసిన శ్రీమతి మాధవి దామెర్ల, ముఖ చిత్రం చక్కగా తీర్చిదిద్దిన ప్రత్యూష కొంచాడ గార్లకు రచయిత కృతజ్ఞతలు.

ఆది నుండి ప్రతీ అంశంలో తగిన సలహాలు, సూచనలు అందించిన సిడ్నీ వాస్తవ్యులు శ్రీ తూములూరి శాస్త్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ప్రతులకు సంప్రదించవలసిన విద్యుల్లేఖనం (ఈమెయులు)  contact@telugumalli.com.

Scroll to Top