క్రమం తప్పని నడకతో…


క్రమం తప్పని నడకతో మధుమేహం అదుపుమధుమేహం (షుగర్ వ్యాధి) అనేక కారణాల వల్ల వస్తుంది. ఈ సమస్య వచ్చిందంటే చాలు. ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం దగ్గర్నుంచి జీవన విధానం వరకూ ఎన్నో మార్పులు చేసుకోవాలి. అలానే కొన్ని వ్యాయామాలు కూడా పాటించాలి. అందులో ఒకటి నడక. ఈ నడక వల్ల డయాబెటీస్ ఉన్నవారికి ఎన్నో లాభాలున్నాయిసాధారణంగా నడక వల్ల బెనిఫిట్స్ ఎక్కువే. భోజనం తర్వాత నడవడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. వాకింగ్ వల్ల లాభాలనేవి తరతరాలుగా వస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఓ పరిశోధన అద్యయనం  జర్నల్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన మెటా విశ్లేషణ గుండె ఆరోగ్యం, ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిపై కూర్చోవడం, నిలబడడం, నడక వంటి ప్రభావాలు ఉంటాయని తెలిపింది. ఎక్కువ సమయం కూర్చోవడంతో పోల్చితే, నిల్చోవడం వల్ల తరచుగా పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్‌ని గణనీయంగా తగ్గించాయి. అయినప్పటికీ, కాంతిలో నడిస్తే శరీరానికి చాలా మంచిదని తేలింది.మంచి లైఫ్‌స్టైల్ మంచి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడంలు అలవాటు అయితే ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడతుంది. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు జీవక్రియ ఎక్కువగా ఉండదు.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల 2హెచ్ గ్లూకోజ్, ట్రయాసిల్ గ్లిసరాల్, అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్(హెచ్‌డిఎల్) కొలెస్ట్రాల్‌తో ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ కారణంగా కార్డియో మెటబాలిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఎక్కువసేపు కూర్చోవడం వచ్చే సమస్యలను, కొవ్వు నిల్వలను, జీవక్రియలను సూచిస్తుంది. మరో అధ్యయనం ప్రకారం సిస్టోలిక్ రక్తపోటు, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, ఇన్సులిన్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్, నడుము చుట్టుకొలత కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు. ఎక్కువసేపు కూర్చునే బదులు భోజనం అనంతరం కాసేపు నడవడం అనేది గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రభావాన్ని తగించిందని పరిశోధనలు చెబుతున్నాయి.ఎక్కువసేపు కూర్చోవడంతో పోలిస్తే అప్పుడప్పుడు నిల్చుని నడవడం వల్ల పోస్ట్ గ్లూకోజ్‌ని గణనీయంగా తగ్గిస్తుంది. కానీ పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ బీపిపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు.జాబ్ చేసేవారు తమ పని ఒత్తిడి వల్ల వర్కౌట్స్ చేయడం లేదు. కానీ, అది ఎప్పుడు మంచిది కాదు. అలాంటివారు కచ్చితంగా మినీ వాకింగ్ ఎంచుకోవాలి. ఎందుకంటే, నడవడం వల్ల శరీరం అలసిపోతుంది. ఉదయం చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు కూడా శారీరక శ్రమ ఉండడం లేదు. కాబట్టి వారు జిమ్‌కే వెళ్ళాల్సిన అవసరం లేదు. కాఫీ తాగుతూ నడవడం, హాలులో షికారు చేయడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేయొచ్చు. దీని వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది షుగర్ వంటి సమస్యలు రావు. వచ్చినా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.కచ్చితంగా మంచి జీవనంతో పాటు మంచి అలవాట్లు ఉండడం వల్ల ఎన్నో సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకూ ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Scroll to Top