పొడిదగ్గు ని దూరముంచాలంటే!

చలికాలంలో ఎక్కువగా మంచు వల్ల చలి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటిలో పొడి దగ్గు ఒకటి. కోవిడ్ -19 తర్వాత చాలా మంది పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పొడి దగ్గు వల్ల కఫం ఏర్పడదు.  గొంతులో నొప్పి మొదలవుతుంది. అందుకే ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచే వాటినే తినాలి. అప్పుడే ఎలాంటి సమస్య నుంచైనా ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు.పొడి దగ్గు ఒకరి నుంచి ఒకరి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే చుట్టూ ఉన్న వారికి కాస్త దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీళ్లు పొడి దగ్గును తగ్గిస్తాయి. ఇందుకోసం ముందుగా గ్లాస్ వాటర్ ను తీసుకుని గోరువెచ్చగా వేడి చేయండి. ఈ వాటర్ లో నల్ల ఉప్పును వేసి నోట్లో పోసి పుక్కిలించినా.. లేదా తాగినా ఈ సమస్య నుంచి తొందరగా బయపడతారు.వేడి వేడి పాలు తాగితే కూడా పొడిదగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. వేడి పాలను నెమ్మదిగా తాగితే పొడి కఫం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలలో నల్లమిరియాల పొడిని కలుపుకుని తాగితే  దీని నుంచి తొందరగా బయటపడతారు. తేనె ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా తేనెను ఉపయోగించి పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇది పొడి దగ్గును తగ్గించడమే కాదు కడుపునకు సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుంది.తులసి ఆకులు కూడా పొడిదగ్గు తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. తులసిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకులను నీళ్లలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.అల్లం టీ కూడా దగ్గును తగ్గిస్తుంది. అలాగే టీ స్పూన్ తేనెలో అర టీస్పూన్ శొంఠిని కలిపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. తమలపాకులను తింటే కూడా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Scroll to Top