రక్తపోటుని నియంత్రించే జ్యూస్‌


అధిక రక్తపుపోటు (హైపర్‌టెన్షన్‌) ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. దీని కారణంగా.. గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధులు, చూపు కోల్పోవడం, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మీ డైట్‌లో కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

అధిక రక్తపోటు సమస్యకు మన లైఫ్‌స్టైల్‌ మార్పులే ఎక్కువగా కారణమవుతున్నాయి. ఇందులో అధిక బరువు, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు, పైయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడడం.. వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

హైబీపీని అదుపులో ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆహారంలో మార్పులు, వ్యాయామం, సమయానికి నిద్రపోవడం, స్ట్రెస్‌ కంట్రోల్‌ చేసికుంటే బీపీని కంట్రల్‌ చేసుకోవచ్చని అంటున్నారు. మీ డైట్‌లో కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

బీట్‌రూట్‌ జ్యూస్‌:
ఒక అధ్యయనం ప్రకారం, బీట్‌రూట్ మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే నైట్రేట్లు హైపర్‌టెన్షన్‌ను నియంత్రించి, గుండె సమస్యలు, గుండెపోటును నివారిస్తాయి. బీట్‌రూట్‌ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్స్‌, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్‌రూట్‌ను రోజూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీన్ని కట్ చేసి సలాడ్‌గా తీసుకోవచ్చు లేదా బీట్‌ రూట్‌ జ్యూస్‌గా చేసుకుని తాగొచ్చు.

దానిమ్మ జ్యూస్‌:
దానిమ్మ జ్యూస్‌ తాగితే, శరీరంలో రక్తం పెరుగుతుందని చాలా మందికి తెలుసు. కానీ దానిమ్మలోని యాంటీహైపెర్టెన్సివ్ లక్షణాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఒక పరిశోధన ప్రకారం, దానిమ్మలో హైపర్‌టెన్షన్‌ను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. దానిమ్మ జ్యూస్‌ తీసుకుంటే.. ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించే లక్షణాలు ఉన్నాయి. దానిమ్మ తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

టమాటా జ్యూస్‌‌:
టమాటా జ్యూస్‌‌‌ సిస్టోలిక్‌, డయాస్టోలిక్‌ బీపీని కంట్రోల్‌లో ఉంచుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో, పరిశోధకులు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులకు ప్రతి రోజూ ఒక కప్పు టమాటా జ్యూస్‌ ఇచ్చారు. వారిలో హైపర్‌టెన్షన్‌, కొలెస్ట్రాల్‌ రెండిటినీ మెరుగుపరుస్తుందని వారు కనుగొన్నారు. టమాటాలో కార్డియో- ప్రొటెక్టివ్‌ లక్షణాలు ఉన్నాయి. దీనిలో లైకోపీన్, బీటా-కెరోటిన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్-సి, ఫ్లేవనాయిడ్స్, విటమిన్- ఈ పుష్కలంగా ఉంటాయి.

బ్లూ బెర్రీ జ్యూస్‌:
నేచర్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, బ్లూబెర్రీస్ తినడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్ రెండింటినీ తగ్గిస్తుంది. బ్లూబెర్రీస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. బ్లూ బెర్రీ జ్యూస్‌ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌ చేయడానికి సహాయపడుతుంది.

Scroll to Top