వాటర్ బాటిళ్ళతో బ్యాక్టీరియా…


వాటర్ బాటిళ్ళతో బ్యాక్టీరియా ముప్పు
వేసవి ముందే వచ్చేసింది. మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. మనం ఎక్కడికి వెళ్తినా.. మన వెంట ఓ వాటర్‌ బాటిల్‌ కచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాం. పిల్లలు స్కూళ్లకు వెళ్లేప్పుడు, పెద్దవాళ్లు ఆఫీస్‌కు వెళ్లేప్పుడు వాటర్‌ బాటిల్‌ మోసుకెళ్తూ ఉంటారు. మనం వెళ్లే ప్రాంతాల్లో మంచినీరు దొరుకుతుందో లేదోనని ముందుజాగ్రత్త పడుతుంటాం. అయితే, మంచినీరు తాగడానికి ఎక్కువగా వినియోగించే రీయూజబుల్‌ వాటర్‌ బాటిళ్లపై మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనం తెలిపింది. రకరకాల బాటిల్ మూతల నుంచి అమెరికాకు చెందిన ‘వాటర్‌ఫిల్టర్‌గురు. కామ్‌’ నమూనాలను సేకరించి పరిశోధించింది. ఈ క్రమంలో వారు గ్రామ్-నెగెటివ్ రాడ్స్, బాసిల్లస్‌ వంటి రెండు రకాల బ్యాక్టీరియాను గుర్తించారు.

సమస్యలకు మూలం
రీయూజబుల్‌ వాటర్‌ వాటర్‌ బాటిల్స్‌పై బాసిల్లస్ ఫ్యామిలీకి చెందిన బ్యాక్టీరియా కాలనీలుగా ఏర్పడి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా కారణంగా.. కలిగే ఇన్ఫెక్షన్‌తో యాంటీ బయోటిక్స్ పనిచేయకపోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే బాసిల్లస్‌కు చెందిన కొన్నిరకాల బ్యాక్టీరియా జీర్ణాశయ సంబంధిత సమస్యలకు కారణం అవుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

కంప్యూటర్ మౌస్ పై చేరే బ్యాక్టీరియా కన్నా ఈ వాటర్ బాటిల్ పై ఉండే బ్యాక్టీరియా సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే ఇంట్లోని పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టే గిన్నెలు కూడా ఈ వాటర్ బాటిల్ కన్నా ఎంతో శుభ్రంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. పెట్ బౌల్ కన్నా ఈ వాటర్ బాటిల్స్ పైన చేరే బ్యాక్టీరియాల సంఖ్య 14 రెట్లు ఎక్కువ ఉంది. కిచెన్‌సింక్‌తో పోలిస్తే రెండు రెట్లు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది.

అధిక సంఖ్యలో బ్యాక్టీరియా
బాటిళ్లపై అధిక సంఖ్యలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ.. అందులో అన్నీ ప్రమాదకర ఇన్ఫెక్షన్‌ కారకాలు కావని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వైద్య నిపుణుడు వెల్లడించారు. ‘వాటర్‌ బాటిళ్ల కారణంగా అనారోగ్యానికి గురైన కేసు గురించి నేను వినలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజల నోటిలో ఉన్న బ్యాక్టీరియాతోనే బాటిళ్లు కలుషితమయ్యే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. ఈ బాటిళ్లను రోజుకు కనీసం ఒక్కసారైనా సోపు కలిపిన వేడి నీటితో శుభ్రం చేయాలని పరిశోధకులు సూచించారు. వాటర్‌ బాటిళ్లను రోజుకు కనీసం ఒక్కసారైనా సోపు కలిపిన వేడి నీటితో శుభ్రం చేయాలని పరిశోధకులు సూచించారు. వారానికి ఒకసారైనా ఉప్పు నీటితో బాటిళ్లు శుభ్రం చేయాలి. ఎండలో కనీసం రెండు గంటలసేపు ఉంచాలి.

నీరు తాగడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్‌గా ఉండాలని చెబుతారు. పని మీద బయటికి వెళ్ళడం చేస్తుంటారు. అలాంటి వారు వారికి సౌకర్యంగా ఉండేందుకు వాటర్ బాటిల్స్‌ని యూజ్ చేస్తారు. ఇంట్లోనూ వాటర్ బాటిల్స్‌నే ఎక్కువగా వాడతారు. అలాంటి వారు వాటిని వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అందులోని బ్యాక్టీరియా ఆరోగ్య సమస్యలకి కారణమవుతుందని సూచిస్తున్నారు.సాధారణంగా రెగ్యులర్‌గా వాడే వాటర్ బాటిల్స్‌ని రోజుకి ఓ సారైనా క్లీన్ చేయాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే బాసిల్లస్ వంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని.. ఇవన్నీ కూడా జీర్ణ సమస్యలని కలిగిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

Scroll to Top