ఎక్కువ చదివేవారికే దీర్ఘాయుష్షు

జీవితంలో చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు, కొత్త అనుభవాల కోసం ఉవ్విళ్ళూరేవారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. దీర్ఘాయువు కోసం జన్యువుల మీద చేసిన ఒక అధ్యయనం ప్రకారం, విద్యను సుదీర్ఘ కాలం అభ్యసిస్తే, పాఠశాల చదువు దాటి ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని ఏళ్ళ ఆయుష్షు పెరుగుతుందట.

అధిక బరువు ఉన్న వ్యక్తులు ప్రతి అదనపు కిలోగ్రాము బరువుకు రెండు నెలల ఆయుష్షు తగ్గుతుందని ఆ అధ్యయనం సూచించింది. children_booksఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు తమ తల్లిదండ్రుల జీవితకాల రికార్డులతో పాటు 600,000 మందికి పైగా ఇతర వ్యక్తుల నుండి జన్యు సమాచారాన్ని విశ్లేషించారు.

మన జీవనశైలి ప్రభావం సగటు జీవితకాలంపై ఎక్కువగా ఉంటోంది. మద్యం సేవించడం, సిగరెట్ తాగడం లేదా వీటికి బానిస అవ్వడం వంటివి డీఎన్ ఏ పైన విపరీతమయిన ప్రభావితం చూపిస్తుంది. సిగరెట్ అలవాటు ఉన్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తద్వారా వారి జీవితకాలం తగ్గుతుందని వారు కనుగొన్నారు. ఒక రోజుకి సగటున ఒక సిగెరెట్ ప్యాకెట్ తాగితే, జీవితకాలంలో ఏడు సంవత్సరాలు తగ్గుతుందని వారు లెక్కించారు. అయితే, పొగత్రాగేవారు ఆ అలవాటు మధ్యలో మానుకుంటే అలవాటు లేని వారు ఎంత కాలం బ్రతుకుతారో వీళ్ళు అంతే కాలం బ్రతుకుతారు. శరీరంలో కొవ్వు మరియు మధుమేహం తెచ్చే ఇతర కారకాలు కూడా జీవితకాలం పైన ప్రభావం చూపిస్తాయి.

మొత్తంగా ఈ అధ్యయనం చెప్పేది ఏంటంటే, మనం ఎన్నేళ్లు చదువు మీద శ్రద్ధ ఉంచాం, మనకు ఎన్ని మంచి లేదా చెడు అలవాట్లు ఉన్నాయి, మన శరీరంలో ఎంత కొవ్వు ఉంది లాంటి అంశాలు మనం ఎన్నేళ్లు జీవిస్తామో నిర్ణయిస్తుంది.

Scroll to Top