ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. శరీరానికి అవసరమైనంత కొలెస్ట్రాల్ తప్పకుండా ఉండాలి. ఇలా అవసరమైనంత కొలెస్ట్రాల్ ఉంటే అది ఆరోగ్యకరమైన సెల్స్‌ని తయారు చేస్తుంది. కానీ ఒకవేళ ఆ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే దాని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
ఇవే ఇబ్బందులు..?
నిజానికి ప్రతి కొలెస్ట్రాల్ కూడా ఆరోగ్యానికి హానికరం కాదు. లో డెన్సిటీ లిపో ప్రొటీన్ అనేది చెడు కొలెస్ట్రాల్. ఇది ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి చూసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు ఈ కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా కలుగుతాయి. ఎప్పుడూ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండకూడదు. అధికంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకనే ముందు నుండి జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. అవసరం అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన మందులు వాడుతూ ఉండాలి.
కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు..
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఫాలో అవక పోవడం వల్ల నష్టం వస్తుంది. అలాగే హై కొలెస్ట్రాల్ జెనెటిక్‌గా కూడా వస్తుంది. స్మోకింగ్, అధిక బరువు, ఊబకాయం, ఇన్ యాక్టివిటీ మొదలైన వాటి వల్ల కొలెస్ట్రాల్ సమస్య వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, కొన్ని రకాల మందులు ఉపయోగించడం వంట పద్ధతులను అనుసరించాలి. అప్పుడు హై కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
హై కొలెస్ట్రాల్ లెవల్స్‌ను గుర్తించాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అయితే కొన్ని రకాల లక్షణాల్ని కూడా మనం హై కొలెస్ట్రాల్ సమస్య ఉంటే చూడొచ్చు. ఆ లక్షణాలు ఏమిటంటే..?
కాళ్ళు తిమ్మిరి ఎక్కడం :
కాళ్ళు, పాదాలలో తిమ్మిరెక్కినా లేదంటే కాళ్లల్లో బాధ కలిగితే హై కొలెస్ట్రాల్ ఉందని చెప్పొచ్చు. ఇది ఆర్టెరీస్, బ్లడ్ వెసెల్స్‌లో ఇబ్బంది వల్ల కలుగుతుంది. అలానే కాళ్ళల్లో, పాదాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నొప్పి కలగడం, క్రామ్ప్స్ వంటివి కూడా మనం గుర్తించొచ్చు. హై కొలెస్ట్రాల్ వలన కాళ్లల్లో ఎంతో అన్ కంఫర్ట్‌గా కూడా ఉంటుంది. ఇలా ఈ లక్షణాల ద్వారా హై కొలెస్ట్రాల్ లెవల్స్ ను గుర్తించచ్చు.
గోళ్లు పాలిపోవడం :
గోళ్లు రంగు మారిపోయి పాలిపోయినట్లు ఉంటే కూడా హై కొలెస్ట్రాల్ ఉందని తెలుసుకోవచ్చు. ఇది కూడా హై కొలెస్ట్రాల్ యొక్క లక్షణమే. సాధారణంగా హై కొలెస్ట్రాల్ వల్ల బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగదు కొన్ని రకాల శరీర భాగాలకు బ్లడ్ చేరుకోదు. గోళ్ళ కి కూడా రక్తం చేరుకోదు దీనితో గోళ్ల లో మార్పు వస్తుంది ఇది హై కొలెస్ట్రాల్ లక్షణమని గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. దాని వలన ఇబ్బంది పడాలి తర్వాత.
స్ట్రోక్, హార్ట్ ఎటాక్ :
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆర్టెరీస్ కనుక బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ ని తీసుకు వచ్చే అవకాశం ఉంది అయితే కొంత మంది హై కొలెస్ట్రాల్ ఉందని తెలుసుకోరు. దాని వల్ల జీవితమే ప్రమాదంలో పడుతుంది.
ఎలా తగ్గించుకోవాలి..?
కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం అంటే సరైన జీవన విధానం ఉండాలి. డాక్టర్ సలహా మేరకు మందులు ఉపయోగిస్తే మంచిది. ఇక జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని చూస్తే… ఆల్కహాల్, పొగాకుకి దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే హై కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకో వచ్చు. అలానే తీసుకునే ఆహారం విషయానికి వస్తే.. సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. బరువు బాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అధిక బరువు వంటి వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగి పోతుంది కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.