ప్రస్తుత సమాజంలో ఎంతోమంది అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడి వల్ల అలసటతో బాధపడుతున్నారు. ఇటీవల ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఎలాంటి కారణం లేకుండా నిత్యం అలసటతో ఉంటే ఈ సమస్యని
ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో విటమిన్ల లోపం కారణంగా ఇలా అలసటకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదు రకాల విటమిన్ లోపం అలసటకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
* విటమిన్ డి లోపం కారణంగా కూడా నిత్యం అలసటగా ఉంటుంది. శరీరంలో కాల్షియం సంగ్రహణకు విటమిన్ డి ఉపయోగపడుతుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కండరాల్లో నిస్సత్తువ ఆవహిస్తుంది. నిత్యం అలటగా ఉంటుంది. అందుకే ఈ సమస్య నుంచి యటపడాలంటే.. తీసుకునే ఆహారంలో ప్యాటీ ఫిష్, గుడ్లు ఉండాలి. ఉదయం సూర్యరక్ష్మి పడేలా చూసుకోవాలి.
* విటమిన్ బి12 లోపం కూడా అలసటకు ఒక కారణమని నిపుణులు అంటున్నారు. రక్త నాళాలు, రక్త కణాల్ని బూస్ట్ చేయడంలో ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. ఈ విటమిలో తరచూ తలనొప్పి వస్తుంటుంది.
* శరీరంలో మెగ్నీషియం లోపించిన ఇలా అలసగా ఉంటుంది. కండరాలు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. మెగ్నీషియం లోపిస్తే కండరాలు లాగిన భావన కలుగుతుంది. నట్స్, సీడ్స్, తృణ ధాన్యాలు తీసుకుంటే ఈ సమస్య దూరమవుతంది.
* విటమిన్ బీ9 లేదా ఫోలేట్ లోపం కారణంగా శరీరంలో కొత్త సెల్స్ నిర్మాణం జరగదు. ఫలితంగా అలసట, నైరాశ్యం, ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆకు కూరలు, పండ్లు , తృణ ధాన్యాలు తప్పకుండా తీసుకోవాలి.
* శరీరంలో ఐరన్ లోపిస్తే ఇలాగే నిత్యం అలసటగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హిమోగ్లోబీన్ తయారీలో కీలక పాత్ర పోషించే ఐరన్ లోపం కారణంగా ఎనీమియా సమస్య వస్తుంది. దీంతో రక్తంలో ఆక్సిజన్ అన్ని అవయవాలకు సరిగ్గా సరఫరా కాదు. దీంతో తల తిరగడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. తీసుకునే ఆహారంలో ఆకు కూరలు, మాంసం, గుడ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
అయితే విటమిన్లని టాబ్లెట్లు, సిరప్స్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.