గుడ్డుతో ఆరోగ్యం వెరీ గుడ్

హెల్దీ పుడ్ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది మొదట గుడ్డునే. గుడ్డులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కాబట్టే ప్రతినిత్యం భోజనంలో తీసుకుంటుంటారు.అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? ఎవరు తినాలి? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? అనేది చాలామంది తెలియవు.గుడ్లు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రోజుకు 2 గుడ్లు మాత్రమే తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అంటే ఉడికించిన మొత్తం గుడ్డు అయితే 2 కంటే ఎక్కువ గుడ్లు తినకూడదు. ముఖ్యంగా ప్రతిరోజూ గుడ్లు తినే అలవాటు ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుడ్లు ఆరోగ్యకరమని మంచిదే అయినప్పటికీ అతిగా తినడం కూడా ప్రమాదకరమే. గుడ్లలో విటమిన్ ఎ, డి, బి-12 పుష్కలంగా ఉన్నాయి. అలాగే, గుడ్లు ప్రోటీన్లకు సరైన ఆహారం. బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు తినడం మంచిది.ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి గుడ్లు తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఎందుకంటే గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీని పచ్చసొనలో కొవ్వు పుష్కలంగా ఉంటుంది.

Scroll to Top