పాలుతో తినకూడని పదార్థాలు


పాలని సంపూర్ణాహారంగా చెబుతారు. పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాదు పాలు శరీరానికి కావలసిన ఎముకలు, కండరాలకు శక్తిని, దృఢత్వాన్ని ఇస్తాయి. పాలు ఆహారానికి అనుబంధ ఆహారంగా పరిగణిస్తారు. కాగా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిత్యం పాలు తాగడం మంచిదే అయినా పాలతో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు.

పాలు, పెరుగు కలిపి పొరపాటున కూడా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ పెరిగే అవకాశం ఉంది. నిమ్మకాయను పాలతో కలిపి తీసుకోవడం మానేయాలి. నిమ్మకాయతో పాటు పాలతో కలిపి బెల్లం, ఉప్పు కూడా తీసుకోకూడదు. పాలు తీసుకునేటప్పుడు పుచ్చకాయ ముక్కలను పొరపాటున కూడా తినకూడదు. పాలు పుచ్చకాయ చాలా హానికరమైన కలయిక గా పరిగణించబడుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల విరోచనాలు వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

పాలు తాగిన వెంటనే మినప్పప్పును, పెసరపప్పును, శనగపప్పులను తినకూడదు. పాలు తాగిన వెంటనే పప్పులను తింటే జీర్ణక్రియ సరిగ్గా జరగదు. గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పాలు తాగిన తర్వాత ముల్లంగిని, ముల్లంగి తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. పాలతో కలిపి వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ముల్లంగిని తీసుకోవాల్సి వచ్చినా పాలు తాగిన రెండు గంటల తర్వాత మాత్రమే తీసుకోవాలి.

పాలు తాగిన తర్వాత పుల్లటి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి పాలు తాగిన తర్వాత పుల్లటి పండ్లను పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ అలా తింటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక పాలను నాన్ వెజ్ ఆహారంతో కలిపి పొరపాటున కూడా తీసుకోకూడదు. నాన్ వెజ్ ఆహారంతో కలిపి పాలను తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు శరీరంపై ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Scroll to Top