అపూర్వ నృత్యకళా స్రష్ట

అపూర్వ నృత్యకళా స్రష్ట ఆంధ్రజాలరి సంపత్ కుమార్

డి వై సంపత్ కుమార్ అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కానీ ఎంతో విశిష్టమైన విలక్షణమైన ఆంధ్రజాలరి నృత్యానికి ఆద్యుడుగా గుర్తింపు పొందిన సంపత్ కుమార్ దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం, సంగీతాలను ఏకీకృతం చేశారు. జాలరి అంటే పడవ నడిపేవాడు అని అర్ధం. ఆంధ్ర జాలరి అంటే ఆచార్య డి.వై.సంపత్ కుమార్.

ఆయన పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారు. దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద భరతనాట్యం పై శిక్షణ పొందారు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతను భరతనాట్యం , కూచిపూడి , యక్షగానం, జానపద నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టారు. అతను దేశ, విదేశాలలో కొన్ని వేల ప్రదర్శనలిచ్చారు. 1954 నుండి 1999 వరకు 45 సంవత్సరాలలో అతని శిక్షణలో 60 మంది కళాకారులు తయారైనారు.
ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం నందు శ్రీ గీతా నృత్య కళాశాలను ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.

ఇదివరకు తెరచాప పడవకు గట్టిగా కట్టి గాలి వాటంతో నీటిమీద ప్రయాణం చేసేవారు లేదా చేపలు పట్టేవారు. గాలి లేనప్పుడు పడవ సరంగులు పడవకు తాడు కట్టి కాలువ గట్టున నడుస్తూ లాగేవారు. బరువైన పడవల్ని అతి కష్టంగా అరుపులతో, కేకలతో పాటలతో పడవల్ని లాగే వారు. పాడుతూ లయప్రకారం అడుగులు వేస్తూ పాట పాడుతూ కష్టం తెలియకుండా పడవను ఒడ్డుకుచేర్చేవారు .

నృత్యరూపకంలో ఆంధ్రజాలరి గా ప్రఖ్యాతి వహించిన సంపత్ కుమార్ జాలరి వేషం ధరించి ఉదయాన్నే లేచి ఎంతో సంతోషంగా చేపలు పట్ట టానికి తన నావతో సముద్రంలోకి వెళతాడు. చేపల కోసం గాలిస్తాడు. ఇంతలో కారు మేఘాలతో తుపాను కమ్ముకుంటుంది. పడవ వూగిపోతూ వుంటుంది. జాలరి మెలికలు తిరిగి పోతాడు. ఇంతలో ఒక పెద్ద చేప గాలానికి తగుల్కుని జాలర్ని అతలాకుతలం చేస్తుంది. అయినా పట్టు విడువని జాలరి పడవలో తల క్రిందులై పోతూనే ఎంతో కష్ట పడి ఆ చేపను ఒడ్డుకు చేర్చటం తుఫాను హోరు తగ్గి పోవటంతో విజయ వంతంగా ఆనందంతో గంతు లేస్తాడు.

ప్రదర్శనానికి రంగ స్థలం తెరమీద బ్యాక్ ప్రొజక్ష్ణన్ తో సముద్ర హోరుని చూపిస్తారు. ఉరుముల్ని, మెరుపుల్ని లైటింగ్ తో జిగేలు మనిపిస్తారు. నేపద్య్యంలో సన్ని వేశాన్ని అనుసరించి తబలా ధ్వనులు అద్భుతంగా సహరిస్తాయి. ఈ కళా రూపాన్ని అత్యద్భుతంగా సృష్టించిన ఘనత సంపత్కుమార్కు దక్కుతుంది. ఈ కళారూపానికి సంబంధించిన పడవ పాటల్ని ప్రజా నాట్య మండలి రాష్ట్ర దళం జాతీయ సమైక్యతకు ఉపయోగించింది పడవ సరంగులుగా, జాలరులుగా కొంత మంది వేషాలు ధరించి రంగ స్థలం మీద జాలరుల వేషాలతో గడ పట్టి పడవ నడపటం, చుక్కాని పట్టటం, తెర చాప ఎత్తటం మొదలైన అభినయాలతో విద్యార్థులు మొదలైన వారు అక్కడక్కడ ప్రదర్శించేవారు. కానీ ఈ జాలరి వేషాన్ని విజయనగరం కు చెందిన డి.వై.సంపత్ కుమార్ తన నాట్య ప్రదర్శనలతో పాటు ఈ వేషాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించారు. అవార్డుల నందుకున్నారు. ప్రజానాట్య మండలి కళాకారుడుగా ఈ కళా రూపాన్ని దేశ మంతటా ప్రదర్శించారు. జాలరి నృత్యం అద్భుతమైన కళాఖండంగా చెప్పవచ్చు.

ఆచార్య డి.వై.సంపత్ కుమార్ ను ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్, ఫోక్ నృత్యములోను, కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడు భరతనాట్యం , కూచిపూడి , యక్షగానం మరియు ఫోక్ నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టారు. అయన కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 -1999 ల మధ్య 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖ నృత్య శిక్షణా సంస్థ అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.
1957వ సంవత్సరం కొత్తఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కలిగించారు

ఆంధ్ర జాలరి సృష్టి

1957వ సంవత్సరం కొత్తఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. ఆ రోజుల్లో దూరం, ప్రయాణ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని తన సొంత ఆర్థిక పరిమితుల కారణంగా రాజారావు, సంపత్ కుమార్ పర్యటనకు కొంత డబ్బును రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందటానికి అంగీకరించాడు. కాని ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ప్రతినిధి బృందంలో భాగంగా తన బృందాన్ని ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేశారు. ఏమి చేయాలనే దానిపై సంపత్ కుమార్ అభీష్టానుసారం వదిలివేశారు.

సాధారణంగా ఒక నృత్యం ప్రదర్శించాలంటే చాలా మంది సహకారం అవసరమవుతుంది. అటువంటిది కేవలం ఇద్దరితో ఏ అంశం చేయాలో అనే ఆలోచనలో పడ్డ సంపత్ కుమార్‌కి ఆ ఆలోచన అతన్ని భీమిలికి తీసుకుపోయింది. అక్కడ సముద్ర తీరాన సాగరమే సంసారంగా, దినదిన గండంగా దినాలు గడిపే నిరుపేద జాలరుల జీవన సమరాన్ని, భావగర్భితంగా ఏ సాహిత్యము లేకుండా కేవలం ” మైమ్ ” తో ప్రదర్శించే మహత్తర భావం రూపుదాల్చుకుంది. అవసరార్థం, పోటీకొరకు, సరదాగా కూర్చిన ఈ నృత్యం ఇతివృత్తపరంగాను , సాంకేతికపరంగాను అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. కేవలం తబలా శబ్ద తరంగాలతో, అలలు, తూఫాను హోరు, ఉరుములు, మెరుపుల సృష్టితో, ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే ఈప్రత్యేక తరహా నృత్య రూపకం అవతరించి, ఒక అద్భుతమైన కళాఖండమై విరాజిల్లింది.

సంపత్ కుమార్ రాసిన అన్ని నృత్య రచనలలో “ఆంధ్ర జాలరి” చాలా ప్రసిద్ది చెందింది. వాస్తవానికి “ఆంధ్ర జలారి” సంపత్ కుమార్‌కు పర్యాయపదంగా మారింది. కాలక్రమేణా ఇది అతని పేరుకు పూర్వలగ్నంగా మారింది.

రాజారావు అతనికి సరోజినీనాయుడు రాసిన “కోరమందల్ ఫిషర్స్” నకలును అందజేసాడు. ఈ కవితపై తన ఆలోచనలను ఆధారం చేసుకొని మెరుగుపరచమని సూచించాడు. సంపత్ కుమార్ తబలా రాజు అనే తబలా కళాకారుని సహాయంతో కేవలం 15 రోజులు ఈ భావనపై పనిచేసి, దానిని రాజా రావుకు సమర్పించాడు, దీనిని న్యూ ఢిల్లీలో జరిగిన అఖిల భారత నృత్య పోటీలో ప్రదర్శించమని ప్రోత్సహించాడు. ఇది పాటలు, సాహిత్యం లేదా సంగీత వాయిద్యాలు లేని చాలా అరుదైన కూర్పు. ఇది పూర్తిగా తబాలా లయలపై ఆధారపడి ఉంటుంది. ఈ నృత్యం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మత్స్యకారుడి జీవితంలో రోజువారీ పడిన కష్ట,నష్టాలను ప్రదర్శిస్తుంది. ఈ నృత్య అంశం సంపత్‌కు అపారమైన పేరు, కీర్తిని తెచ్చిపెట్టింది. అతనికి అనేక పురస్కారాలు కూడా లభించాయి. సోలో జానపద నృత్య విభాగంలో 1400 మంది పోటీదారులలో 1957 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత నృత్య పోటీలలో మొదటిసారి బహుమతి పొందినపుడు, అప్పటి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఇది 1973 లో బెర్లిన్‌లో 143 దేశాలు పాల్గొన్న “ప్రపంచ యువజన ఉత్సవం” లో అంతర్జాతీయ బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. 1974 లో ఇది ఆప్ఘనిస్థాన్‌లోని కాబూల్ వద్ద , తాష్కెంట్, సమర్ఖండ్, అల్మట్టి, రిగా, కీవ్, ఒడీశా, సోచి, మాస్కోలలో ప్రదర్శించబడింది. అక్కడ ఇది టెలివిజన్ లో ప్రసారం చేయబడింది. తరువాతి కాలంలో, ఈ నృత్య అంశం తబాలా రాజు విద్యార్ధి అయిన టి.వి.రమణ మూర్తికి కూడా కీర్తిని తెచ్చిపెట్టింది.

ఆంధ్రజాలరి, నాట్య విశారద, విశ్వప్రజానార్థకుడు, నృత్య చైతన్య, నాట్యకళాధార, నాట్య భూషణ, అభ్యుదయ నాట్య కళా శ్రేష్ట వంటి బిరుదులను డివై సంపత్ కుమార్ పొందారు. వందల సన్మానాలను అందుకున్నారు. పిఠాపురంలో కళాకారులు అతనిని గజారోహణం చేసారు. 1982 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతనికి వెండి పతకం, సన్మాన పత్రాన్ని అందజేసింది. రాజమండ్రి మునిసిపాలిటీ అతనికి పౌర సన్మానం చేసి సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం అతన్ని టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) టెలికాం సలహా కమిటీ గౌరవ సభ్యునిగా ప్రతిపాదించింది. కాకినాడ (ఆంధ్రప్రదేశ్) నుండి ప్రచురించబడిన సంగీత, నృత్య మాసపత్రిక ‘గణకాల’ కు అసోసియేట్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్రారంభం నుండి గరికపాటి రాజారావు వంటి వ్యవస్థాపక సభ్యులతో కలసి పనిచేసారు. నవంబరు 20, 1927న జన్మించిన సంపత్ కుమార్ మే 27, 1999న కాలధర్మం చెందారు.

Scroll to Top