తులసిలో ఔషధగుణాలెన్నో!


తులసి మొక్కను హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్క పవిత్రమైనది మాత్రమే కాదు ఔషధయుక్తమైనది కూడా. చాలామంది ఇళ్లల్లో తులసి మొక్క ఒక భాగంగా ఉంటుంది. తులసి ఆకులను మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. తులసి ఆకులను తింటే దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

తులసి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం , ఫాస్ఫరస్, జింక్, మాంగనీస్ ఉంటాయి. అనేక ఖనిజాల అద్భుతమైన మూలకంగా తులసి ఉంటుంది. తులసిలో ఉర్సోలిక్ యాసిడ్, లినాలూల్, కార్వాక్రోల్ , రోస్మరినిక్ ఆసిడ్, లుటీన్, ఎస్ట్రా గోల్ వంటి ఎన్నో క్రియాశీలక పదార్థాలు ఉంటాయి.

తులసి ఆకులను తినడం వల్ల శరీరం పైన ఉన్న గాయాలు త్వరగా తగ్గిపోతాయి. తులసి ఆకులు నొప్పి నివారిణిగా ఉపయోగపడతాయి. తులసి ఆకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు తులసి ఆకులను తింటే బరువు తగ్గుతుంది. శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపించి బరువు తగ్గించడానికి తులసి దోహదం చేస్తుంది.

తులసిలో ఉండే అనేక పోషకాలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రతిరోజు తులసి ఆకులను తినడం వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు. స్ట్రెస్ ను తగ్గించడానికి తులసి ఒక సహజసిద్ధమైన ప్రకృతి వర ప్రసాదిని. ఒక కప్పు తులసి టీ ని తాగితే కూడా ఒత్తిడి పరారవుతుంది.

తులసి ఆకులు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. దురదలను తగ్గిస్తాయి. తులసిలో ఉండే జింక్, విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కాబట్టి తులసి ఆకులను క్రమం తప్పకుండా టీ రూపంలో గానీ, పచ్చి ఆకులను తినడం ద్వారా కానీ, తీసుకుంటే ఆరోగ్యంలో అద్భుతాలు జరుగుతాయి.

తులసి ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది. టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు తులసిటీని తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ప్రతిరోజు తులసి ఆకులను తినడం వల్ల దంతాలు, నోటి ఆరోగ్యం బాగుపడుతుంది. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్, విటమిన్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

Scroll to Top