ఉదయాన్నే నిద్ర లేస్తే…

ఉదయాన్నే నిద్ర లేవటం మంచి అలవాటు

ఉదయాన్నే ప్రతిరోజు నిద్రలేవటం మంచి అలవాటు. త్వరగా లేవటం వల్ల రోజువారీ పనులు అన్నింటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవటానికి వీలవుతుంది. త్వరగా నిద్ర లేస్తారు కాబట్టి పనులన్నీ త్వరగా అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే కాస్త సమయం కూడా మిగులుతుంది. అయితే కొంతమంది మాత్రం ఉదయం నిద్ర కచ్చితంగా లేవాలని అనుకొని ప్రతిరోజు ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు. ఇలా ఆలస్యం చేయడం వల్ల పనులు ఆలస్యం అవ్వడమే కాకుండా పని చేయాలనిపించకపోవడం, యాక్టివ్ గా ఉండలేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే త్వరగా లేవని చాలామంది ప్రజలు వారు ఉదయంత్వరగా లేవాలని ఎంత ప్రయత్నం చేసినా వారికి కుదరదు. దీనివల్ల కొంతమందిలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే త్వరగా నిద్ర లేవాలనుకునే వాళ్ళు కొన్ని నియమాలను పాటిస్తే కచ్చితంగా ఉదయం త్వరగా నిద్ర మేలుకునే వీలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి త్వరగా నిద్రపోతే ఉదయం కూడా త్వరగా లేవడానికి అవుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు మొబైల్ ఫోన్, లాప్టాప్ ని పక్కన పెట్టేయడం వల్ల నిద్రలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే రాత్రి పూట కాస్త తక్కువ ఆహారం తినడమే మంచిది. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడానికి అవ్వదు. పైగా జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.కాబట్టి ఉదయం నిద్ర లేవాలనుకునేవారు ఉదయం లేచిన వెంటనే ఏ పని చేయాలనుకుంటున్నారో, ఏ సమయానికి చేయాలని అనుకున్నారో వాటిని మీరు ముందే ఒక షెడ్యూల్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. అప్పుడైతే కచ్చితంగా మీరు పనులు త్వరగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ పనులన్నీ చేయాలని మీరు ఒకరోజు ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉదయం నిద్ర త్వరగా మేలుకుంటారు.

Scroll to Top