బార్లీతో బహుముఖ లాభాలు


బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఇదో గ్రేట్ ఫుడ్ అని చెప్పొచ్చు.
షుగర్ రాగానే ఆ సమస్యని కంట్రోల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా బార్లీని కూడా వాడొచ్చు. చాలా రోజుల నుంచి బార్లీని ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఇది అనేక సమస్యలకి దివ్యౌషధం. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో బార్లీ హెల్ప్ చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు వంటివన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. బార్లీ నీటిని తీసుకుంటే బహుముఖ ప్రయోజనాలు పొందొచ్చు.

*ముందుగా ఓ కప్పు బార్లీని నీటితో బాగా కడగాలి. తర్వాత బార్లీలో ఆరు కప్పుల నీటిని వేసి మీడియం మంటపై ఉడికించాలి. మీకు ఇష్టమైతే కొద్ది దాల్చిన చెక్క, అల్లం ముక్క కూడా వేయండి. తర్వాత బార్లీ ఉడికిన తర్వాత గోరువెచ్చగా అయ్యాక అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగితే చాలు.

*బార్లీ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల ఆహారంలోని గ్లూకోజ్‌ని నెమ్మదిగా గ్రహించేలా చేసి రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో వెంటనే చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. బార్లీ నీటిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరుగుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరానికి శక్తిని అందించేందుకు కణాలు గ్లూకోజ్‌ని తగ్గిస్తాయి.

*బార్లీ నీరు తీసుకుంటే అజీర్ణం, మలబద్ధకం, ప్రేగు సంబంధిత సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు.. ఈ న్యూట్రిషియస్ డ్రింక్ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదని. దీని వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

*బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్ అవుతాయి. దీని వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. అదే విధంగా, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించి డయాబెటిస్ కంట్రోల్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది.

*బార్లీ నీటిని తాగడం వల్ల బరువు తగ్గించాలనుకునేవారు కూడా ఈజీగా ఆ బెనిఫిట్‌ని పొందుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నీరు తాగిన వెంటనే కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోరు. బరువు కంట్రోల్ అవుతుంది.

*కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ బార్లీ వాటర్ హెల్ప్ చేస్తుంది. మూత్ర విసర్జనని పెంచడం ద్వారా షుగర్ వల్ల వచ్చే కిడ్నీ సమస్యల్ని తగ్గిస్తుంది. దీంతో చాలా వరకూ కిడ్నీ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

Scroll to Top